News June 22, 2024
బీజేపీ స్టేట్ చీఫ్ ఎవరు? నేతల వ్యాఖ్యలకు అర్థమేంటి?
TG: రాష్ట్రంలో కాషాయ దళపతి ఎవరనే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ బీజేపీలోని నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొత్త నీరు, కొత్త నాయకత్వం అవసరమంటూ ఈటల కామెంట్ చేయగా.. దేశం, ధర్మం, పార్టీపై భక్తి ఉన్నవారికే పగ్గాలు ఇవ్వాలని రాజాసింగ్ అన్నారు. దీంతో వీరిద్దరూ చీఫ్ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రఘునందన్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్ కూడా పోటీ పడుతున్నట్లు సమాచారం.
Similar News
News November 9, 2024
అవును.. కెనడాలో ఖలిస్థానీలున్నారు: ట్రూడో
కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులున్నట్లు ఆ దేశ PM జస్టిన్ ట్రూడో అంగీకరించారు. అయితే తమ దేశంలోని సిక్కులందరికీ వారు ప్రతినిధులు కారని స్పష్టం చేశారు. మోదీని అభిమానించే హిందువులూ తమ దేశంలో ఉన్నారని, వారు కూడా మొత్తం హిందువులకు ప్రతినిధులు కాదని అన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీలకు కెనడా స్వర్గధామంగా మారిందన్న భారత్ ఆరోపణలకి ట్రూడో వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చాయి.
News November 9, 2024
వరుసగా 2 సెంచరీలు.. సంజూ రికార్డ్
సౌతాఫ్రికాతో తొలి T20లో సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. అంతకుముందు అతడు HYDలో బంగ్లాతో T20లోనూ సెంచరీ చేశారు. దీంతో టీ20ల్లో భారత్ తరఫున వరుసగా 2 సెంచరీలు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన నాలుగో బ్యాటర్‌గా నిలిచారు. తొలి 3 స్థానాల్లో మెకియాన్, రొసోవ్, సాల్ట్ ఉన్నారు. ఇక T20ల్లో IND తరఫున 2 సెంచరీలు చేసిన తొలి వికెట్ కీపర్‌గానూ సంజూ రికార్డ్ నెలకొల్పారు.
News November 9, 2024
ట్రంప్‌పై హత్యకు ఇరాన్ వ్యక్తి ప్లాన్: అమెరికా
డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్‌కు చెందిన షకేరీ అనే వ్యక్తి కుట్ర చేశాడని అమెరికా న్యాయ శాఖ తాజాగా ఆరోపించింది. ఇరాన్ ప్రభుత్వం తరఫున అతడు ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని పేర్కొంది. చిన్నప్పుడే అమెరికాకు వచ్చిన అతడిని 2008లో ఓ చోరీ కారణంగా ఇరాన్‌కు US పంపించేసిందని వివరించింది. ఈ ఏడాది అక్టోబరు 7న ట్రంప్‌ను హత్య చేసేందుకు కొంతమంది తనకు ప్లాన్ అందించారని అతడు తమకు చెప్పినట్లు స్పష్టం చేసింది.