News March 23, 2024
‘ఆప్’ను నడిపించేదెవరు?
అవినీతిపై పోరాటంతో ఉద్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అదే అవినీతి మకిలికి బలవుతోంది. ఆప్ నేతలు సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ తరహాలోనే కేజ్రీవాల్ కూడా ఇప్పట్లో జైలు నుంచి బయటికొచ్చేలా కనిపించడం లేదు. దీంతో బయట పార్టీని నడిపించడానికి నేతలు కరవయ్యారు. అతిశీ, రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్ పేర్లు వినిపిస్తున్నా.. వారికి పాలనా అనుభవం అంతంతే. రాజకీయంగానూ BJPకి ఎదురొడ్డి నిలబడటం కత్తి మీద సామే.
Similar News
News September 19, 2024
ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి: షర్మిల
AP: తిరుమలను అపవిత్రం చేస్తూ TDP, YCPలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. ‘లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారన్న CBN వ్యాఖ్యలు తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయి. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే తక్షణం ఉన్నతస్థాయి కమిటీ వేయండి. లేదా CBIతో విచారణ జరిపించండి. ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి’ అని ట్వీట్ చేశారు.
News September 19, 2024
సీబీఐ విచారణ వేయండి: అంబటి రాంబాబు
AP: తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు దుర్మార్గపు ఆరోపణ చేయడం సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘రాజకీయ లబ్ధి కోసం మరీ ఇంత నీచానికి దిగజారుతావా చంద్రబాబు’ అని వైసీపీ ట్వీట్ చేసింది. కాగా, నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారుచేశారని చంద్రబాబు నిన్న వ్యాఖ్యానించారు.
News September 19, 2024
పోలీసుల అదుపులో జానీ మాస్టర్
అసిస్టెంట్ డాన్సర్‌పై అత్యాచారం కేసులో పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు అతడిని బెంగళూరు విమానాశ్రయం సమీపంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు మహిళా కమిషన్ ఆదేశాలతో బాధితురాలికి భద్రతను పెంచారు.