News April 24, 2024
తాడిపత్రిలో తడాఖా చూపేదెవరో!
అనంతపురం(D) తాడిపత్రిలో దశాబ్దాలుగా జేసీ బ్రదర్స్ హవా నడిచింది. 1985 నుంచి 2009 వరకు JC దివాకర్ రెడ్డి జైత్రయాత్ర అప్రతిహాతంగా కొనసాగింది. 2014లో ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. వీరి విజయపరంపరకు 2019లో కేతిరెడ్డి పెద్దారెడ్డి(YCP) బ్రేక్ వేశారు. ఈ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు. TDP నుంచి 2019లో పోటీ చేసి ఓడిన ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ మరోసారి సమరానికి సై అంటున్నారు.
<<-se>>#ELETIONS2024<<>>
Similar News
News November 20, 2024
కులగణన సర్వే 72 శాతం పూర్తి
TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ఇప్పటివరకూ 72% పూర్తయింది. నిన్నటి వరకు 83,64,331 ఇళ్లలో సర్వే చేసినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ములుగులో 98.9% ఇళ్లలో సర్వే పూర్తయింది. ఆ తర్వాతి రెండు స్థానాల్లో నల్గొండ (95%), జనగామ (93.3%) ఉన్నాయి. హైదరాబాద్‌లో అత్యల్పంగా 50.3% ఇళ్లలో కులగణన జరిగింది.
News November 20, 2024
భాస్కర –II ఉపగ్రహం విశేషాలు
1981లో సరిగ్గా ఇదే రోజు రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రయోగ వేదిక నుంచి భాస్కర –II ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. 444KGS బరువు ఉండే ఈ శాటిలైట్ పని చేసే కాలం ఒక సంవత్సరం కాగా, ఇది పదేళ్లు కక్ష్యలో తిరిగింది. భూ పరిశీలన కోసం ప్రయోగించిన భాస్కర శ్రేణిలో ఇది రెండవ ఉపగ్రహం. గణిత శాస్త్రవేత్త మొదటి భాస్కరుడు గుర్తుగా దీనికి ఆ పేరు పెట్టారు. దీనికి ముందు 1979లో భాస్కర-I ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.
News November 20, 2024
నేడు వేములవాడకు సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు వెళ్లనున్నారు. ఉ.10:10 నుంచి ఉ.11.45 గంటల మధ్యలో వేములవాడ రాజన్నను దర్శించుకుంటారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులు, మిడ్ మానేరు నిర్వాసితుల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మ.1.45 తర్వాత HYDకు తిరుగు ప్రయాణమవుతారు.