News June 30, 2024

ఈ రికార్డులు బ్రేక్ చేసేదెవరో?

image

భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ టీ20Iల్లో అత్యధిక పరుగులు(4,231), సెంచరీలు(5), సిక్సర్ల(205) రికార్డులు తన పేరిటే లిఖించుకున్నారు. అంతేకాదు 9 T20WCలు ఆడిన ఏకైక ప్లేయర్ రోహిత్ కావడం గమనార్హం. కెప్టెన్‌గానూ T20Iల్లో అత్యధిక మ్యాచులు(50) గెలిచారు. వీటిలో కొన్ని రికార్డులు చెరిగిపోయినా హిట్ మ్యాన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.

Similar News

News October 7, 2024

2047 నాటికి ‘వికసిత్ భారత్’ను మనందరం చూస్తాం: పవన్

image

గుజరాత్ CMగా మోదీ ప్రమాణం చేసి నేటికి 23ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు AP Dy.CM పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘విప్లవాత్మక నిర్ణయాలతో కోట్లాది మంది భారతీయుల జీవితాలను మార్చడం ఆరోజు మొదలైంది. ఆయన నాయకత్వంలో దేశం అంతర్జాతీయ స్థాయిలో అన్ని రంగాల్లో దూసుకుపోతూ, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ను మనం చూస్తామని నమ్ముతున్నాను’ అని ట్వీట్ చేశారు.

News October 7, 2024

RRBలో 7951 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. పరీక్ష తేదీల ప్రకటన

image

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) జూనియర్ ఇంజినీర్ పోస్టుల పరీక్ష తేదీలను ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి 13 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపింది. దీని ద్వారా RRB మొత్తం 7951 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇక అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షలు నవంబర్ 25-29 వరకు, RPF ఎస్సై ఎగ్జామ్స్ డిసెంబర్ 2-5 వరకు, టెక్నీషియన్ ఎగ్జామ్స్ డిసెంబర్ 16-26 వరకు ఉంటాయని వివరించింది.

News October 7, 2024

ఆ కుర్చీలో కూర్చుంటే మరణశాసనం రాసుకున్నట్టేనా!

image

హెజ్బొల్లా చీఫ్ హ‌స‌న్ న‌స్ర‌ల్లాను ఇజ్రాయెల్ హతమార్చడంతో ఆయ‌న వార‌స‌త్వాన్ని స్వీక‌రించ‌డానికి కీల‌క నేత‌లు జంకుతున్నారు. ఆ కుర్చీలో కూర్చోవ‌డ‌మంటే మ‌ర‌ణ‌శాస‌నాన్ని రాసుకున్న‌ట్టే అనే భావ‌న‌లో ఉన్నారు. ఈ కార‌ణంతో ఇరాన్ మ‌ద్ద‌తుగల ఈ సంస్థ ప‌గ్గాలు చేప‌ట్ట‌డానికి కీల‌క నేత ఇబ్ర‌హీం అమీన్ నిరాక‌రించారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఈ బాధ్య‌త‌లు ప్రమాదకరమని హెజ్బొల్లా నేతలకు అవగతమైనట్టు తెలుస్తోంది.