News March 31, 2024

సత్తెనపల్లి గడ్డపై సత్తా చాటేదెవరో?

image

AP: రాజకీయ చైతన్యం పుష్కలంగా ఉన్న నియోజకవర్గం పల్నాడు(D) సత్తెనపల్లి. ఇక్కడ అభ్యర్థికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య ఇక్కడి నుంచే 2సార్లు ఇండిపెండెంట్‌గా గెలిచారు. కాంగ్రెస్ 4సార్లు, స్వతంత్రులు 3సార్లు, CPM, TDP 2సార్లు, CPI, YCP ఒక్కోసారి నెగ్గాయి. ఈసారి రాజకీయాల్లో తలపండిన అంబటి రాంబాబు (YCP), కన్నా లక్ష్మీనారాయణ(TDP) ఢీకొంటున్నారు.
#ELECTIONS2024

Similar News

News October 6, 2024

నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు

image

TG: నేటి నుంచి బీఎస్సీ నర్సింగ్ 2024-25 అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 14 వరకు ఆన్‌లైన్‌లో <>దరఖాస్తు<<>> చేసుకోవాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ సూచించింది. ఈఏపీసెట్-2024 క్వాలిఫై అయిన వారిని మాత్రమే అర్హులుగా పేర్కొంది. వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి, మెరిట్ జాబితాను రిలీజ్ చేస్తామని తెలిపింది.

News October 6, 2024

హరియాణాలో మాదే అధికారం: సీఎం సైనీ

image

హరియాణాలో ఎగ్జిట్ పోల్స్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ తిరిగి తామే అధికారంలోకి వస్తామని సీఎం నయబ్ సింగ్ సైనీ ధీమా వ్యక్తం చేశారు. పూర్తి మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. తాము అన్ని రంగాల్లో పనులు చేశామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించారని పేర్కొన్నారు. హరియాణాను వారసత్వం, ప్రాంతీయతత్వం నుంచి వేరు చేసినట్లు పేర్కొన్నారు. కాగా 90 స్థానాలకు ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

News October 6, 2024

తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నారు: సినీ రచయిత

image

డబ్బింగ్ సినిమాలకు తెలుగు పేర్లు పెట్టకుండా విడుదల చేసి తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నారని సినీ రచయిత అబ్బూరి రవి ట్వీట్ చేశారు. ఇతర భాషా చిత్రాల గొప్పదనాన్ని, కళాత్మకతని తాను గౌరవిస్తానని తెలిపారు. తెలుగుని గౌరవించని వారి చిత్రాలను చూసేందుకు డబ్బులు ఖర్చుచేయడం గొప్పతనమని తాను అనుకోవట్లేదన్నారు. కాగా రజినీ ‘వేట్టయాన్’ మూవీ అదే పేరుతో తెలుగులో రిలీజ్ కానుండటం చర్చనీయాంశంగా మారింది.