News March 9, 2025
‘ఛాంపియన్’గా నిలిచేదెవరో?

వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు CT ఫైనల్లో ఇవాళ న్యూజిలాండ్‌తో తలపడనుంది. మ.2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లేయర్లంతా ఫామ్‌లో ఉండటం, ఒకే వేదికలో ఆడటం INDకు కలిసొచ్చే అంశాలు. ICC ఈవెంట్లలో భారత్‌పై కివీస్‌దే పైచేయి కావడం కలవరపెడుతోంది. కాగా ఇవాళ హిట్‌మ్యాన్ సేన విజయ పరంపరను కొనసాగించి కప్పు గెలవాలని కోరుకుందాం. మ్యాచ్ లైవ్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో చూడొచ్చు.
Similar News
News April 14, 2026
రేపు ఇంటర్ ఫలితాలు: మంత్రి లోకేశ్

AP: రేపు (ఏప్రిల్ 15) ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల చేయబోతున్నట్లు మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఉదయం 10.31 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ వెల్లడిస్తామన్నారు. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
*Share It
News April 14, 2026
చంద్రబాబు, స్టాలిన్, సిద్దరామయ్యకు రేవంత్ లేఖ

దక్షిణాది రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, స్టాలిన్, సిద్దరామయ్యకు తెలంగాణ సీఎం రేవంత్ లేఖ రాశారు. నియోజకవర్గాల పెంపుపై కలిసి పోరాడుదామని కోరారు. కేంద్రం చర్యల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు <<19651062>>అన్యాయం<<>> జరుగుతోందన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని సూచించారు. నియోజకవర్గాల పెంపులో హైబ్రిడ్ మోడల్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.
News April 14, 2026
గ్రాము బంగారానికి ₹11వేల లాభం!

2019 OCT 15న ఇష్యూ అయిన సిరీస్-5 సావరిన్ గోల్డ్ బాండ్ల ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ రేపటి నుంచి చేసుకోవచ్చని RBI ప్రకటించింది. అప్పుడు గ్రాము ధర ₹3,738 ఉంటే ఇప్పుడు ₹15,009కు (₹11,271 లాభం) చేరింది. ఏప్రిల్ 9, 10, 13 తేదీల్లో గోల్డ్ ప్రైస్ యావరేజ్ ఆధారంగా RBI దీనిని డిసైడ్ చేసింది. మొత్తంగా 302% ప్రాఫిట్.. అంటే ₹లక్ష పెట్టిన వారికి ₹4లక్షలు వస్తాయి. ఇది కాక ఏటా ఇచ్చే 2.5% వడ్డీ కూడా యాడ్ అవుతుంది.


