News May 10, 2024

ఇన్సూరెన్స్‌పై 18% జీఎస్టీ ఎందుకు?

image

విద్య, వైద్యం.. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా అప్పుల పాలయ్యేది ఈ రెండింటిపై ఖర్చుల వల్లే. ఇప్పుడిప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన వస్తోంది. అయితే కేంద్రం బీమాపై ఏకంగా 18% జీఎస్టీ విధించడం సామాన్య ప్రజలకు భారం అవుతోంది. ఇన్సూరెన్స్ లగ్జరీ ఐటెమ్ కాదని, ప్రజలకు అత్యవసరం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బీమాపై జీఎస్టీ తగ్గిస్తే దేశంలో చాలా మంది ముందుకు వస్తారని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News December 25, 2024

ఆతిశీని అరెస్టు చేస్తారు: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

image

ఢిల్లీ CM ఆతిశీ మార్లేనా, Sr నేతలను అరెస్టు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో 5 రోజుల్లో వీరిపై ఫేక్ కేసులు బనాయిస్తారని BJPని ఉద్దేశించి అన్నారు. తమ పార్టీ ఈ మధ్యే ప్రకటించిన CM మహిళా సమ్మాన్ యోజన, సంజీవనీ యోజన వారిని ఇరుకున పెట్టాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తానని ట్వీట్ చేశారు.

News December 25, 2024

‘బలగం’ వేణుతో సాయిపల్లవి మూవీ?

image

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ‘బలగం’ మూవీ ఫేమ్ వేణు దర్శకత్వంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె ఎల్లమ్మ రోల్‌లో కనిపిస్తారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధవ్ మాటలు అందిస్తారని సమాచారం. వేణు తీసే రెండో సినిమాకి తాను నిర్మాతగా వ్యవహరిస్తానని దిల్ రాజు <<14584831>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

News December 25, 2024

ఇంటర్ అమ్మాయి ఆత్మహత్య

image

తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా హనుమకొండలోని ఏకశిలా కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని గుగులోతు శ్రీదేవి (16) నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంది. శ్రీదేవి అనారోగ్యం కారణంగానే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యాసంస్థల్లో ఓ వైపు ఫుడ్ పాయిజన్, మరోవైపు ఆత్మహత్యలు చర్చనీయాంశంగా మారాయి.