News March 29, 2024

NZBలో 72మందిపై వేటు ఎందుకు?

image

MP, MLA అభ్యర్థులు ఎన్నికల్లో తాము చేసిన ఖర్చును ECకి సమర్పించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో వారిపై అనర్హత వేటు పడుతుంది. ఈ కారణంతో ఒక్క నిజామాబాద్‌లో ఏకంగా 72మందిపై వేటు పడింది. పసుపు బోర్డు విషయంలో నిరసనగా 2019లో నామినేషన్ వేసిన రైతులు ఖర్చుల వివరాలు ఇవ్వలేదు. ఈసారి అనర్హతకు గురైన 1,069మంది గత ఎన్నికల్లో ఖర్చు వివరాలు చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్‌లో 51 మంది, తెలంగాణలో 107 మంది అనర్హతకు గురయ్యారు.

Similar News

News October 14, 2025

అలాంటి ఫ్రెండ్ ఒక్కరున్నా చాలు!

image

ఎవరికైనా ఫ్రెండ్స్ అంటే చాలామందే ఉంటారు. కానీ, బెస్ట్ ఫ్రెండ్ అనగానే ఒక్కరిద్దరు మాత్రమే ఉంటారు. మీరు నవ్వితే వాళ్లు నవ్వుతారు, మీరు ఏడిస్తే ఓదారుస్తారు, మీరు గెలిస్తే వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటారు, మీకు కష్టమొస్తే వాళ్లు అడ్డంగా నిలబడిపోతారు. ఎవరి లైఫ్‌లోనైనా అలాంటి ఫ్రెండ్ ఒక్కరున్నా చాలు. మీ జీవితంలో గెలిచారని చెప్పొచ్చు. మరి అలాంటి ట్రూ ఫ్రెండ్ మీ లైఫ్‌లోనూ ఉన్నారా? కామెంట్ చేయండి.

News October 14, 2025

బత్తాయి, నిమ్మ: OCTలో చేపట్టాల్సిన చర్యలివే..

image

అక్టోబర్‌లో బత్తాయి, నిమ్మ తోటల్లో కాయలు ఉన్న చెట్లకు తేలికపాటి తడి ఇవ్వాలి. శిలీంధ్ర వ్యాధుల నుంచి కాపాడుకునేందుకు కాండంపై బోర్డో పేస్టును పూసుకోవాలి. పిందె, కాయలు రాలడాన్ని నివారించడానికి 100గ్రా. కార్బండిజమ్, 1KG యూరియాను 100L నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. నల్లి నివారణకు నీటిలో కరిగే గంధకాన్ని లీటరు నీటికి 3గ్రా. చొప్పున కలిపి 15 రోజులకోసారి పిచికారీ చేయాలి.

News October 14, 2025

సత్యం వైపు మార్గం చూపేదే ‘వేదం’

image

భగవంతుడు సత్య స్వరూపుడు. శాశ్వతుడు. కానీ ఈ జగత్తు అశాశ్వతం. సత్యమైన దేవుడే ఈ మిథ్యా లోకాన్ని సృష్టించాడు. ఈ అశాశ్వతమైన జీవులందరికీ ముక్తి ప్రసాదించి, తనలో శాశ్వతంగా ఐక్యం చేసుకోవడమే భగవంతుడి అంతిమ లక్ష్యం. జీవులు తిరిగి సత్యం వైపు పయనించడానికి, శాశ్వత స్థితిని పొందడానికి అవసరమైన దేవ మార్గాన్ని(మోక్ష మార్గాన్ని) స్పష్టంగా తెలియజేసేదే వేదం. అందుకే వేదమే సృష్టి ప్రయోజనాన్ని వివరిస్తుంది. <<-se>>#VedikVibes<<>>