News October 6, 2024
విమానాలు తెలుపు రంగులోనే ఎందుకుంటాయి?
విమానాలు ఎక్కువగా తెలుపు రంగులోనే ఉంటాయి. దీనికో కారణం ఉంది. ‘వైట్ పెయింట్ సూర్యరశ్మిని గ్రహించదు. గాల్లో ఉన్నప్పుడు, నేలపై పార్క్ చేసి ఉంచినప్పుడు తెలుపు రంగు క్యాబిన్‌లో వేడిని తగ్గిస్తుంది’ అని నిపుణులు చెబుతున్నారు. డార్క్ పెయింట్‌తో పోల్చితే వైట్ తేలికైనది. డార్క్ కలర్ వేయడం వల్ల విమానం 8 మంది ప్రయాణికులంత బరువు ఎక్కువవుతుంది. తెలుపు రంగు వల్ల గాల్లో పక్షులు ఢీ కొట్టడం తగ్గుతుంది.
Similar News
News November 4, 2024
టెట్ ఫలితాలు.. సందేహాలుంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
AP: రాష్ట్రంలో టెట్‌కు 3,68,661 మంది హాజరవగా 1,87,256 మంది <<14524941>>ఉత్తీర్ణత<<>> సాధించారు. వారందరికీ మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే మెగా డీఎస్సీ విడుదల చేస్తామని ప్రకటించారు. అభ్యర్థులకు సందేహాలుంటే ఉ.11.30 నుంచి సా.5.30 వరకు 9398810958, 7995649286, 6281704160, 7995789286 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.
News November 4, 2024
బీటెక్ సీట్లలో ఈ మూడు రాష్ట్రాలదే అధిక వాటా!
ఇంజినీరింగ్ చదివే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. డిగ్రీ కంటే బీటెక్ చదివేందుకే విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. 2024-25లో దేశవ్యాప్తంగా 14.90 లక్షల బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా తమిళనాడులో 3,08,686 సీట్స్, ఆంధ్రప్రదేశ్‌లో 1,83,532 & తెలంగాణలో 1,45,557 సీట్లున్నాయి. ఇలా చూస్తే దేశంలోని ఇంజినీరింగ్ సీట్లలో ఈ మూడు రాష్ట్రాలే 40శాతం వాటా కలిగి ఉన్నాయి.
News November 4, 2024
BREAKING: టెట్ ఫలితాలు విడుదల
AP: గత నెల 3 నుంచి 21 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంత్రి లోకేశ్ విడుదల చేశారు. <