News July 12, 2024

పిల్లలు ఇలా తయారవుతున్నారేంటి?

image

3వ తరగతి <<13600394>>బాలికపై<<>> ముగ్గురు బాలురు అత్యాచారం చేసి హతమార్చారంటే సమాజంలో క్రూరత్వం ఏ స్థాయిలో పెరుగుతుందో అర్థమవుతోంది. సినిమాలు, సోషల్ మీడియా, అశ్లీల చాటింగ్, మితిమీరిన స్వేచ్ఛ, గంజాయితో రేపటి పౌరుల భవిష్యత్ నీరుగారిపోతోంది. స్కూల్ స్థాయి నుంచే మానవతా విలువలు బోధించడం వల్ల పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మరి చిన్నారులకు క్రైమ్ మెంటాలిటీ రాకుండా ఉండేందుకు మీ సూచనలేంటో కామెంట్ చేయండి.

Similar News

News January 2, 2026

దాడికి సిద్ధం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

image

ఇరాన్‌లో పోలీసుల కాల్పుల్లో ఏడుగురు <<18737357>>నిరసనకారులు<<>> మరణించడంపై US అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిపై కాల్పులు జరపడం ఇరాన్‌కు అలవాటే. దానిని వెంటనే ఆపాలి. లేకుంటే అమెరికా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. మేము లాక్ చేసి లోడ్ చేసుకుని దాడికి సిద్ధంగా ఉన్నాం’ అని పోస్ట్ చేశారు. ‘US జోక్యం చేసుకుంటే పరిస్థితులు ఉద్రిక్తంగా మారతాయి’ అని ఇరాన్ కౌంటరిచ్చింది.

News January 2, 2026

కుడి ఎడమైతే.. పొరపాటు ఉందోయ్!

image

కేరళలో నిన్న BJP పేపర్ ‘జన్మభూమి’లో IUML పేపర్ ‘చంద్రిక’ కంటెంట్ వచ్చింది. ఉదయమే జన్మభూమి చదువుతూ, మధ్యలో BJPని తిట్టే కంటెంట్ చూసి కమల నేతలు ఆశ్చర్యపోయారు. ఇరు పేపర్ల కన్నూర్-కాసర్‌గోడ్ ఎడిషన్ ఒకే ప్రెస్‌లో ప్రింట్ అవుతుంది. అక్కడ పొరపాటున అవతలి పార్టీ కంటెంట్ ప్రింట్ అయిందని తర్వాత తెలిసింది. కాగా BJP-ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ బ్యాక్ డోర్ దోస్తీని ఈ ప్రెస్ నిరూపించిందని CPIM విమర్శించింది.

News January 2, 2026

జల జగడంపై కమిటీ.. కేంద్రం నిర్ణయం

image

తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలసంఘం ఛైర్మన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున కమిటీలో సభ్యులు ఉండనున్నారు. అలాగే కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు, NWDA, CWC సీఈలు కూడా సభ్యులుగా వ్యవహరిస్తారు.