News July 12, 2024
పిల్లలు ఇలా తయారవుతున్నారేంటి?

3వ తరగతి <<13600394>>బాలికపై<<>> ముగ్గురు బాలురు అత్యాచారం చేసి హతమార్చారంటే సమాజంలో క్రూరత్వం ఏ స్థాయిలో పెరుగుతుందో అర్థమవుతోంది. సినిమాలు, సోషల్ మీడియా, అశ్లీల చాటింగ్, మితిమీరిన స్వేచ్ఛ, గంజాయితో రేపటి పౌరుల భవిష్యత్ నీరుగారిపోతోంది. స్కూల్ స్థాయి నుంచే మానవతా విలువలు బోధించడం వల్ల పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మరి చిన్నారులకు క్రైమ్ మెంటాలిటీ రాకుండా ఉండేందుకు మీ సూచనలేంటో కామెంట్ చేయండి.
Similar News
News February 18, 2025
వ్యాయామం చేయకుండానే ఫిట్‌గా ఉండాలా?

కసరత్తులతో చెమటలు చిందించకుండానే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సమతుల్య ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, సీడ్స్, ప్రోటీన్ పదార్థాలు తినాలి. షుగర్, ఫ్రై, ప్రాసెస్‌డ్ ఫుడ్ తినకూడదు. అలాగే లిఫ్ట్ బదులుగా మెట్లు ఎక్కడం, ఇంటి పనులు చేయడం, పార్కులో నడవడం వల్ల కేలరీలు కరిగి శరీరం ఫిట్‌గా మారుతుంది. తగినన్ని నీళ్లు తాగి, తగినంత నిద్ర పోతే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.
News February 18, 2025
మనూ భాకర్‌కు బీబీసీ పురస్కారం

భారత స్టార్ షూటర్ మనూ భాకర్‌కు ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం దక్కింది. పారిస్ ఒలింపిక్స్‌లో ప్రదర్శనకు గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. క్రికెటర్ స్మృతి మంథాన, రెజ్లర్ వినేశ్ ఫొగట్, గోల్ఫర్ అదితీ అశోక్, పారా షూటర్ అవనీ లేఖరా పేర్లు నామినేషన్లో ఉండగా భాకర్‌నే పురస్కారం వరించడం విశేషం. పారిస్ ఒలింపిక్స్ షూటింగ్‌లో మనూ రెండు కాంస్య పతకాల్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే.
News February 18, 2025
ఒడిశాలో విద్యార్థిని ఆత్మహత్యపై స్పందించిన నేపాల్ PM

ఒడిశాలోని కళింగ యూనివర్సిటీలో తమ దేశ విద్యార్థిని ఆత్మహత్య, తదనంతరం చోటు చేసుకున్న <<15495303>>నిరసనలపై<<>> నేపాల్ ప్రధాని కేపీ ఓలీ స్పందించారు. ఢిల్లీలోని తమ ఎంబసీకి చెందిన ఇద్దరు అధికారులను అక్కడికి పంపించినట్లు చెప్పారు. వారు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తారని తెలిపారు. వర్సిటీలోని తమ దేశ విద్యార్థుల ఇష్టప్రకారం కావాలంటే అక్కడి హాస్టల్‌లో, లేదంటే బయట వసతి ఏర్పాట్లు చేస్తారని వెల్లడించారు.