News September 20, 2024
పవన్.. ఎందుకు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు?: ప్రకాశ్ రాజ్

తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. ‘మీరు DCMగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఇష్యూ ఇది. దర్యాప్తు చేయండి. నేరస్థులు దొరికితే కఠిన చర్యలు తీసుకోండి. అంతేగానీ ఎందుకు ఊహాగానాల్ని వ్యాప్తి చేస్తున్నారు? కేంద్రంలో మీ స్నేహితుల వల్ల దేశంలో మనకున్న మతకల్లోలాలు చాలు’ అని ట్వీట్ చేశారు. దీంతో ఆయనపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.
Similar News
News November 20, 2025
నాబార్డ్ ఎర్త్ సమ్మిట్‌లో Dy.CM భట్టి, మంత్రి తుమ్మల

హైదరాబాద్ హైటెక్స్‌లో నాబార్డ్ ఆధ్వర్యంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఎర్త్ సమ్మిట్ 2025 కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. నాబార్డ్ ఛైర్మన్ షాజీ, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గోవర్ధన్ సింగ్ రావత్ తదితర ప్రముఖులు హాజరై పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
News November 20, 2025
AP న్యూస్ రౌండప్

*రైతుల నుంచి ప్రతి ధాన్యం బస్తా కొంటాం: మంత్రి నాదెండ్ల మనోహర్
*బిహార్ CM నితీశ్ కుమార్‌కు YS జగన్ శుభాకాంక్షలు
*గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలకృష్ణకు సత్కారం
*డిసెంబర్ 15 నుంచి అమరావతి రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో సరిహద్దుల్లేని ప్లాట్లకు కొత్త పెగ్ మార్క్‌లు వేసే ప్రక్రియ ప్రారంభం
*2026లో రిటైర్ కానున్న ఐదుగురు IAS అధికారులను నోటిఫై చేసిన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్
News November 20, 2025
ఢిల్లీకి డీకే శివకుమార్.. సీఎం మార్పుపై జోరుగా ప్రచారం

కర్ణాటకలో CM మార్పు ప్రచారం మరోసారి జోరందుకుంది. Dy.CM డీకే శివకుమార్ మరికొంత మంది MLAలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. KAలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటితో రెండున్నరేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ‘పవర్ షేరింగ్’ కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకే ఆయన ఢిల్లీ బాటపట్టారని చర్చ జరుగుతోంది. ఇవాళ రాత్రికి ఖర్గేతో, రేపు KC వేణుగోపాల్‌తో DK వర్గం భేటీ కానుంది. దీంతో సీఎం మార్పుపై ఉత్కంఠ నెలకొంది.


