News October 8, 2025
గణపతి పూజలో తులసి ఆకులను ఎందుకు వాడరు?

తులసీ దేవి, గణేషుణ్ని చూసి తనను వివాహం చేసుకొమ్మని అడుగుతుంది. కానీ నిరాకరిస్తాడు. దీంతో ఆమె కోపంతో బ్రహ్మచారిగా ఉంటావని శపిస్తుంది. ప్రతిగా గణేషుడు ఆమెను రాక్షసుని చెంత ఉండమని శపించాడు. ఆయన శాపానికి చింతించిన ఆమె మన్నించమని అడిగింది. గణేషుడు శాంతించి పవిత్రమైన మొక్కగా జన్మిస్తావని వరమిస్తాడు. కానీ తన పూజలో ఆ పత్రం ఉండటాన్ని నిరాకరిస్తాడు. ఆయన పూజలో తులసి ఆకులు వాడితే పూజాఫలం దక్కదని ప్రతీతి.
Similar News
News April 6, 2026
PHOTO GALLERY: చెన్నైvsRCB మ్యాచ్

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన CSKvsRCB మ్యాచుకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, RCB ఓనర్ అనన్య బిర్లా, మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వంటి ప్రముఖులు సైతం మ్యాచును ఎంజాయ్ చేశారు. 2024 సీజన్ నుంచి చెన్నైపై RCBకి ఇది వరుసగా నాలుగో విజయం. ఈ మ్యాచ్ ఓడటానికి తానే కారణమని, బ్యాటింగ్‌లో తాను మంచి స్కోర్ చేయాల్సిందని CSK కెప్టెన్ రుతురాజ్ అన్నారు.
News April 6, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News April 6, 2026
గైక్వాడ్.. చెన్నైకి భారంగా..

IPL: చెన్నైకి ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ భారంగా మారారు. మంచి స్టార్ట్ ఇవ్వడం పక్కనబెడితే నిర్లక్ష్యపు షాట్లు ఆడుతూ వికెట్ పారేసుకుంటున్నారు. 180+ లక్ష్య ఛేదనలో అతడు 12 మ్యాచుల్లో ఒకే ఒక్కసారి హాఫ్ సెంచరీ చేశారు. 9 సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు. RCBతో మ్యాచులో భారీ లక్ష్యఛేదనలోనూ 7 రన్స్ మాత్రమే చేశారు. అటు కెప్టెన్‌గానూ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.


