News November 4, 2024

కుల గణన ఎందుకు? సమగ్ర కుటుంబ సర్వే ఏమైంది?: బండి

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన ఎందుకు చేస్తోందని బండి సంజయ్ ప్రశ్నించారు. గత BRS ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ ఆ రిపోర్ట్ ఇవ్వకపోతే ఆ సర్వేకు చేసిన ఖర్చంతా ఆయన నుంచే రికవరీ చేయాలన్నారు. KCR, KTRలను చూస్తుంటే రాజకీయాలపై అసహ్యం కలుగుతోందని మండిపడ్డారు. రుణమాఫీ చేయలేదని, ఉద్యోగాలు, ఇతర హామీలపై సమాధానం చెప్తూ కేటీఆర్ పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News December 3, 2025

చిలుకూరులో ‘డబుల్’ ఓట్లు.. విచారణకు డిమాండ్

image

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జానకినగర్ గ్రామ పంచాయతీలో ఒక మహిళ పేరుపై రెండు ఓట్లు నమోదైన ఘటన కలకలం రేపింది. 6వ వార్డులోని 514, 518 సీరియల్ నంబర్లలో ఒకే పేరుతో ఉండగా, ఇంటి పేరు, భర్త పేరు మాత్రం వేరే విధంగా ఉన్నట్లు గుర్తించారు. మండలంలో ఇలా అనేక చోట్ల డబుల్ ఎంట్రీలు ఉన్నాయని ఆరోపిస్తూ, ఓటర్ల జాబితాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

News December 3, 2025

స్క్రబ్ టైఫస్.. జాగ్రత్తలపై అధికారుల సూచనలు

image

AP: ‘ఓరియంటియా సుత్సుగముషి’ బాక్టీరియాతో <<18446507>>స్క్రబ్ టైఫస్<<>> సంక్రమిస్తుందని అధికారులు వెల్లడించారు. కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చతో పాటు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటే స్క్రబ్ టైఫస్‌గా అనుమానించాలని చెప్పారు. ఎలుకలు సంచరించే ప్రదేశాల్లోని కీటకాలు కుడితే ఈ వ్యాధి వస్తుందన్నారు. పొలం పనులకు వెళ్లేవారు షూలు ధరించాలని, మంచాలు, పరుపులు, దిండ్లు వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలని సూచించారు.
Share it

News December 3, 2025

APPSC పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

image

APPSC ఈ క్యాలెండర్ ఇయర్‌లో విడుదల చేసిన 21 ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను <>ప్రకటించింది<<>>. రాతపరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) పరీక్ష జనవరి 27, 31, ఫిబ్రవరి 9, 11, 12 తేదీల్లో, సంబంధిత సబ్జెక్టు పేపర్ల పరీక్షలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు నిర్వహించనున్నారు. విశాఖ, తూ.గో., NTR, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పరీక్షలు జరగనున్నాయి.