News November 4, 2024
కుల గణన ఎందుకు? సమగ్ర కుటుంబ సర్వే ఏమైంది?: బండి
TG: కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన ఎందుకు చేస్తోందని బండి సంజయ్ ప్రశ్నించారు. గత BRS ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ ఆ రిపోర్ట్ ఇవ్వకపోతే ఆ సర్వేకు చేసిన ఖర్చంతా ఆయన నుంచే రికవరీ చేయాలన్నారు. KCR, KTRలను చూస్తుంటే రాజకీయాలపై అసహ్యం కలుగుతోందని మండిపడ్డారు. రుణమాఫీ చేయలేదని, ఉద్యోగాలు, ఇతర హామీలపై సమాధానం చెప్తూ కేటీఆర్ పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 13, 2024
CM చంద్రబాబుకు హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది: పవన్
AP: CM చంద్రబాబును Dy.CM పవన్ ప్రశంసించారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ ‘ఆయన 4 దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీని నడిపించాలి. తన కుటుంబంతో పాటు 5 కోట్ల కుటుంబాలను చూసుకోవాలి. వారి అవసరాలను తీర్చాలి. శత్రువుల దాడులనూ తట్టుకోవాలి. అయినా కూడా ఉన్న 24 గంటలను ప్రజల కోసం ఎలా ఉపయోగించాలని ఆలోచిస్తారు. అందుకే ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
News December 13, 2024
బాబోయ్ చలి.. IMD ఆరెంజ్ అలర్ట్
TG: రాష్ట్రంలో చలి విషయంలో ఈ ఏడాది తొలి ఆరెంజ్ అలర్ట్‌ను హైదరాబాద్ వాతావరణ శాఖ (IMD) జారీ చేసింది. ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయని, అందుకు తగ్గట్లుగా ప్రజలు సిద్ధం కావాలని సూచించింది. పలు జిల్లాల్లో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలిపింది. ‘ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో బాగా ప్రభావం ఉండొచ్చు. ఈ నెల 15 వరకు హైదరాబాద్ మేఘావృతమై ఉంటుంది’ అని పేర్కొంది.
News December 13, 2024
అల్లు అర్జున్ అరెస్ట్ పబ్లిసిటీ స్టంట్: కేంద్ర మంత్రి
క్రియేటివ్ ఇండస్ట్రీ అంటే కాంగ్రెస్‌కు గౌరవం లేదని, ఈ విషయాన్ని అల్లు అర్జున్ అరెస్ట్ మరోసారి నిరూపించిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. సంధ్య థియేటర్ ఘటనకు TG ప్రభుత్వ వైఫల్యమే కారణమని, ఆ నిందను పోగొట్టేందుకు ఇలా పబ్లిసిటీ స్టంట్స్ చేస్తోందని ఆరోపించారు. TG ప్రభుత్వం సినీ ప్రముఖులపై దాడులు చేసే బదులు బాధితులను ఆదుకోవాలని, భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా ఉన్న వారిని శిక్షించాలన్నారు.