News August 24, 2024
అకస్మాత్తుగా చంద్రబాబు బెంగళూరుకు ఎందుకెళ్లారు?: YCP

AP: సీఎం చంద్రబాబు నిన్న అకస్మాత్తుగా రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు ఎందుకెళ్లారని YCP ప్రశ్నించింది. ‘ఆయన తాజ్ హోటల్‌లో రెండున్నర గంటలు గడిపారు. అక్కడ ఎవరిని కలిశారు? ఈ టూర్ షెడ్యూల్ అధికారికంగా ఎందుకు విడుదల చేయలేదు? లోకేశ్ వారంలో రెండోసారి రహస్యంగా విదేశాలకు వెళ్లారు. స్పెషల్ ఫ్లైట్‌లలో చంద్రబాబు, లోకేశ్, పవన్ తిరుగుతున్నారు. రాష్ట్రం ఇలా ముందుకెళ్తోంది’ అని Xలో రాసుకొచ్చింది.
Similar News
News January 19, 2026
డియర్ పేరెంట్స్.. పిల్లల ఆరోగ్యంతో ఆటలొద్దు!

స్క్రీన్ టైమ్ విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏదో పనుందనో, అన్నం తినట్లేదనో, రిలాక్స్ అవుదామనో పిల్లలకు ఫోన్, TVలు అలవాటు చేస్తున్నారు. అయితే అలా చేస్తే వారి మానసిక ఎదుగుదల, సోషల్ స్కిల్స్, సెల్ఫ్ మోటివేషన్, ఫిజికల్ యాక్టివిటీస్, రియల్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్ వంటివి లోపిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఫోకస్ చేయడం, భాష నేర్చుకోవడం కూడా ఆలస్యమవుతుందని చెబుతున్నారు.
News January 19, 2026
సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని<
News January 19, 2026
వరిలో జింకు లోపాన్ని ఎలా నివారించాలి?

వరి తర్వాత తిరిగి వరినే పండించే నేలలో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్‌ను ప్రతి రబీ పంటకు ముందు దమ్ములో వేసి పైరులో జింకు లోపం ఏర్పడకుండా నివారించవచ్చు. భాస్వరం ఎరువులు వేయడానికి 2 రోజుల ముందు జింకు సల్ఫేట్ వేయాలి. పైరుపై జింకు లోపం కనిపిస్తే ఒక ఎకరానికి 400 గ్రాముల జింకు సల్ఫేట్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి వరి ఆకులు మొత్తం తడిచేలా.. నిపుణుల సూచనలతో వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.


