News February 20, 2025
మిర్చియార్డుకు రాని పేర్ని నానిపై కేసా?: అంబటి

AP: గుంటూరు మిర్చి యార్డు పర్యటన తర్వాత నమోదైన కేసుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘వైఎస్ జగన్ సహా 9 మందిపై కేసు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగించలేదు. కానీ పర్యటన వైపు కన్నెత్తి చూడని పేర్ని నానిని ముద్దాయిగా చేర్చడం ఆశ్చర్యాన్ని కలిగించింది’ అని ట్వీట్ చేశారు. ధర పడిపోవడంతో నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని జగన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News March 21, 2025
తులసి మెుక్క ఇంట్లో ఉంటే కలిగే లాభాలివే..!

హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మెుక్కను లక్ష్మీదేవీ స్వరూపంగా భావిస్తారు. దోమలు, కీటకాలు వంటివి ఇంట్లోకి రాకుండా రక్షణ కల్పిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఉంటే పాజిటివ్ ఎనర్జీ. తులసి ఆకుల్ని నమిలితే జలుబు, దగ్గు వంటి వ్యాధులకు ఉపశమనం లభించడంతో పాటు జీర్ణక్రియ బాగా జరుగుతుంది. గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి, తద్వారా మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. వీటి వాసన పీల్చుకుంటే ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది.
News March 21, 2025
మెగాస్టార్ చిరంజీవికి సీఎం రేవంత్ అభినందనలు

TG: UKలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవిని CM రేవంత్ అభినందించారు. ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు చిరంజీవిగారికి హృదయపూర్వక అభినందనలు. మీకు లభించిన ఈ గౌరవం తెలుగుజాతికి గర్వకారణం. భవిష్యత్తులో మీరు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్ఠలను విశ్వవేదికపై చాటిచెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
News March 21, 2025
ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258కోట్లు

ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చును కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ప్రధాని పర్యటనల ఖర్చును తెలపాలని కోరగా విదేశాంగ శాఖ బదులిచ్చింది. 2022 మే నుంచి 2024 డిసెంబర్ వరకూ ప్రధాని 38 విదేశీ పర్యటనలకు చేయగా రూ. 258కోట్లు ఖర్చయినట్లు తెలిపింది. 2023 జూన్‌లో జరిగిన అమెరికా పర్యటనకు అధికంగా రూ.22కోట్లు ఖర్చు జరిగినట్లు తెలిపింది.