News December 20, 2024
లాభం వస్తే స్పాన్సర్ ఎందుకు వెనక్కి వెళ్లారు?: HCలో ఏజీ ప్రశ్న
TG: ఈ కార్ రేసింగ్‌తో ప్రభుత్వానికి భారీ లాభం వస్తే స్పాన్సర్ ఎందుకు వెనక్కి వెళ్లారని ఏజీ సుదర్శన్ రెడ్డి హైకోర్టులో వాదించారు. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ‘ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది. గవర్నర్ అనుమతి తీసుకున్నాం. అగ్రిమెంట్ లేకుండానే 2 విడతల్లో OCT 3, 11 తేదీల్లో డబ్బు పంపారు. రేసులో ఆర్బిట్రేషన్‌ను FPO వెనక్కి తీసుకుంది’ అని ఏజీ తెలిపారు.
Similar News
News January 22, 2025
ఇవాళ్టి నుంచి JEE మెయిన్ పరీక్షలు
దేశంలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే JEE మెయిన్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలో 12 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానుండగా, తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 22, 23, 24 తేదీలతో పాటు 28, 29 తేదీల్లో 2 సెషన్ల(ఉ.9-12, మ.3-6)లో పరీక్షలు జరగనున్నాయి. 30న బీఆర్క్, బీ ప్లానింగ్ పరీక్ష నిర్వహిస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
News January 22, 2025
ALERT.. ఇవాళ, రేపు జాగ్రత్త
తెలంగాణను చలి వణికిస్తోంది. ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గి, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తూ, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతాయని, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News January 22, 2025
ఫిబ్రవరి 5న మహా కుంభమేళాకు ప్రధాని మోదీ!
UPలోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు PM మోదీ FEB 5న వెళ్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల 10న ప్రయాగ్‌రాజ్ చేరుకొని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నట్లు సమాచారం. అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 27న ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు 9 రోజుల్లో 9 కోట్ల మంది మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.