News April 7, 2024
అందుకే విడాకులు తీసుకున్నా: ఆమిర్ మాజీ భార్య

ఎంతో ఆలోచించిన తర్వాతే ఆమిర్‌ఖాన్ నుంచి విడాకులు తీసుకున్నట్లు అతని మాజీ భార్య కిరణ్‌రావు తెలిపారు. ‘విడాకుల విషయంలో నేను భయపడలేదు. ఏకాంతం కావాలని, స్వతంత్రంగా జీవించాలని అనుకున్నా. స్వతహాగా ఎదగాలని భావించా. నా ఆలోచనలను ఆమిర్ గౌరవించి సపోర్ట్ చేశాడు. మా మధ్య ప్రేమాభిమానాలు ఇప్పటికీ మారలేదు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2005లో వీరికి పెళ్లి కాగా, 2021లో విడిపోయారు. వీరికి ఒక బాబు ఉన్నాడు.
Similar News
News April 20, 2026
GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.

తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.490 తగ్గి రూ.1,55,290 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రూ.450 తగ్గి రూ.1,42,350కి చేరింది.