News October 18, 2024
సల్మాన్ ఖాన్ ఆ బ్రాస్‌లెట్ ఎందుకు ధరిస్తారంటే..
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ధరించే బ్రాస్‌లెట్ చాలా ఫేమస్. ఆయన ఫ్యాన్స్ దాన్ని పోలిన బ్రాస్‌లెట్లను ధరిస్తుంటారు. అలాంటి బ్రాస్‌లెట్‌ను తన తండ్రి ధరిస్తుండేవారని ఓ ఇంటర్వ్యూలో సల్లూభాయ్ తెలిపారు. ‘దీనిలోని నీలం రంగు రాయిని ఫెరోజా లేదా టర్కోయిస్ అని పిలుస్తారు. దీన్ని జీవం ఉన్న రాయిగా చెబుతారు. నాపై నెగటివిటీని అడ్డుకుని పగిలిపోతుంది. ఇలా ఇప్పటికి ఏడుసార్లు మార్చాను’ అని వివరించారు.
Similar News
News November 14, 2024
రేపు 2 విశేషాలు.. మార్కెట్లకు సెలవు
భారత స్టాక్‌మార్కెట్లు శుక్రవారం పనిచేయవు. కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 15న ఈక్విటీ, డెరివేటివ్స్ మార్కెట్లకు సెలవు. కమోడిటీస్ మార్కెట్లు మాత్రం మధ్యాహ్నం వరకు పనిచేస్తాయి. దీంతో మార్కెట్ వర్గాలకు 3 రోజుల విరామం లభించినట్టైంది. ప్రస్తుతం దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వరుసగా రెండోవారమూ పతనమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ చెరో 2%, బ్యాంకు నిఫ్టీ 3% తగ్గాయి.
News November 14, 2024
గ్రూప్-4 ఫలితాలు విడుదల
TG: గ్రూప్-4 ఫలితాలు వెల్లడయ్యాయి. 8,084 మంది అభ్యర్థులతో ప్రొవిజనల్ లిస్టును TGPSC సైట్‌లో పొందుపర్చారు. ఈ బటన్ <
News November 14, 2024
టీమ్ ఇండియా ఫొటో షూట్: న్యూ లుక్‌లో కోహ్లీ
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నాహాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ సిరీస్ కోసం భారత క్రికెటర్లకు ఫొటో షూట్ నిర్వహించారు. ఈ ఫొటోల్లో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ కొత్త లుక్‌లో అదరగొడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ నెల 22 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమ్ ఇండియా క్రికెటర్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.