News March 19, 2024
కాకినాడ నుంచే ఎందుకు?
AP: కాకినాడ లోక్సభ స్థానంలో జనసేన తరఫున ఉదయ్ బరిలోకి దిగుతున్నారు. కాగా ఈ పార్లమెంట్లోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాపు సామాజిక వర్గం బలమైన ఓటు బ్యాంకుగా ఉంది. గతంలో ఇక్కడ అత్యధిక సార్లు కాపు అభ్యర్థులే ఎంపీలుగా గెలిచారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి 1,32,648, TDPకి 5,11,892 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం YCP అభ్యర్థిగా ఉన్న చలమలశెట్టి సునీల్ 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు.
Similar News
News January 9, 2025
బుమ్రా బంగారు బాతు.. చంపేయొద్దు: కైఫ్
భారత క్రికెట్కు బుమ్రా బంగారు బాతు వంటి ఆటగాడని, ఆ బాతును ఎక్కువగా వాడి చంపేయకూడదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూచించారు. ‘బుమ్రాను కెప్టెన్గా నియమించే ముందు బీసీసీఐ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. కెప్టెన్సీ భారాన్ని వేరేవారికి వదిలేసి బుమ్రా కేవలం వికెట్లు తీయడంపై దృష్టి సారించేలా చూడాలి. లేదంటే ఆ ఒత్తిడి అతడికి కొత్త గాయాలను తీసుకొచ్చి మొదటికే మోసం రావొచ్చు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
News January 9, 2025
పిల్లలకు జన్మనిస్తే రూ.81,000.. యువతులకు ఆఫర్
రష్యాలో గత ఏడాది జననాలు తగ్గడంతో ఆ దేశంలోని కరేలియా యంత్రాంగం సంచలన ప్రకటన చేసింది. 25 ఏళ్ల లోపు యువతులు ఆరోగ్యకరమైన చిన్నారులకు జన్మనిస్తే రూ.81,000 ఇస్తామని ప్రకటించింది. కరేలియాకు చెందిన వారై స్థానికంగా చదివేవారిని అర్హులుగా పేర్కొంది. అయితే ఇప్పటికే పిల్లలున్న వారికి ఇది వర్తించదని తెలిపింది. ఇతర ప్రాంతాలు ఇదే విధానాన్ని అనుసరించే యోచనలో ఉన్నాయి.
News January 9, 2025
అధికారుల సేవ TTD కంటే TDPకే ఎక్కువ: అంబటి
AP: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తిరుపతిలో ఘోరం జరిగిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ‘అధికారులు టీటీడీ కంటే టీడీపీకే ఎక్కువ సేవ చేస్తున్నారు. ఆఫీసర్లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి ఏం సాధించారు? అధికారులను తిడితే సమస్యలు పరిష్కారమవుతాయా? ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇవ్వాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.