News April 10, 2024
అంబటి రాయుడి ‘సిద్ధం’ ట్వీట్ ఇందుకేనా?

క్రికెటర్ అంబటి రాయుడు ‘సిద్ధం’ అని ట్వీట్ చేయడంతో ఆయన తిరిగి వైసీపీలో చేరుతున్నట్లు అంతా భావించారు. అయితే, జనసేన పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేయగా అందులో రాయుడి పేరుంది. రాయుడు జనసేనకి మద్దతిస్తుండటంతో ఆయన ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. దీంతో జనసైనికులు సైతం ఆయనను ఆహ్వానిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News March 24, 2025
BREAKING: తండ్రైన స్టార్ క్రికెటర్

భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రయ్యారు. ఆయన భార్య అతియా శెట్టి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారిద్దరు సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈ కారణంగానే ఇవాళ IPL మ్యాచ్‌కు రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపు రాహుల్‌కు తోటి క్రికెటర్లు, ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
News March 24, 2025
ఒకే ఓవర్‌లో 6, 6, 6, 6, 4

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో బ్యాటర్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. 30 బంతుల్లోనే 75 రన్స్ చేశారు. ఇందులో 7 సిక్సులు, ఆరు ఫోర్లు ఉన్నాయి. స్టబ్స్ వేసిన ఓ ఓవర్‌లో వరుసగా 6, 6, 6, 6, 4 బాదారు. మొత్తంగా 28 రన్స్ రాబట్టారు.
News March 24, 2025
ఓటీటీలో అదరగొడుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’

వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ జీ5లో అదరగొడుతోంది. ఇప్పటి వరకు 400M+ స్ట్రీమింగ్ మినట్స్ నమోదైనట్లు మేకర్స్ వెల్లడించారు. రికార్డులను తిరగరాస్తూ దూసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. థియేటర్లలో ₹300Crకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం ఈ నెల 1న OTTలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ట్రెండింగ్‌లో కొనసాగుతుండటం విశేషం. ఈ మూవీలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి హీరోయిన్లుగా నటించారు.