News January 15, 2025

ఆర్మీ డే ఇవాళే ఎందుకంటే?

image

భారత సైన్యాన్ని అధికారికంగా ఏప్రిల్ 1, 1895న స్థాపించారు. స్వాతంత్ర్యం తర్వాత చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ భారతదేశానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ మదప్ప కరియప్ప అనే కమాండర్‌కు ఇదే రోజున 1949లో బాధ్యతలు అప్పగించారు. దీనిని స్మరిస్తూ ప్రతి ఏటా JAN 15న ఆర్మీ డే నిర్వహిస్తున్నారు. ఈ రోజున సైనికుల శౌర్యాన్ని, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వేడుకలు చేస్తారు.

Similar News

News November 5, 2025

7 బిలియన్ ఏళ్ల కిందట విశ్వం టెంపరేచర్ ఎంత?

image

‘బిగ్ బ్యాంగ్’ ప్రకారం 13.8బిలియన్ ఏళ్ల కిందట ఏర్పడిన విశ్వంలో ఎన్నో అద్భుతాలు, రహస్యాలున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని జపాన్ సైంటిస్టులు కనుగొన్నారు. ఈ యూనివర్స్ టెంపరేచర్ ప్రస్తుతం 2.7K(కెల్విన్) ఉండగా, 7B ఏళ్ల కిందట 5.13 కెల్విన్(−268°C) ఉండేదని తేల్చారు. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్‌గ్రౌండ్ పరిశీలనలు.. విశ్వం క్రమంగా చల్లబడుతోందనే అంచనాలను ధ్రువీకరిస్తున్నాయి.
* సెల్సియస్= కెల్విన్-273.15

News November 5, 2025

భరణి నక్షత్రంలో కార్తిక పౌర్ణమి విశిష్టత

image

సాధారణంగా కార్తిక పౌర్ణమి కృత్తిక నక్షత్రంతో శ్రేష్ఠమైనది. కానీ ఈ ఏడాది భరణి నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చింది. దీనికి ప్రత్యేక స్థానం ఉందని పండితులు చెబుతున్నారు. ‘ఈ పౌర్ణమి+భరణి కలయిక పాపాలను పోగొట్టి, మోక్షాన్ని, పితృదేవతల ప్రసాదాన్ని ఇస్తుంది. నేడు చేసే దీపదానం, పితృతర్పణం, గంగాస్నానం వల్ల ఆత్మశుద్ధి కలుగుతుంది. కృత్తిక జ్ఞాన ప్రకాశాన్నిస్తే భరణి పాప నాశనం చేస్తుంది’ అంటున్నారు.

News November 5, 2025

ఈ 4 కారకాలతోనే గుండె జబ్బులు: వైద్యులు

image

ఇటీవల గుండెపోటు మరణాలు పెరగడంతో గుండె జబ్బులు, స్ట్రోక్స్ రాకుండా ఉండేందుకు వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. ‘99శాతం గుండె జబ్బులు అకస్మాత్తుగా రావు. మొదటిసారి ఈ సమస్యలు ఎదుర్కొనే వారిలో కొన్ని ప్రమాద కారకాలు గుర్తించాం. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఎలివేటెడ్ బ్లడ్ షుగర్, పొగతాగడం వంటివే ఆ కారకాలు. వీటిని నియంత్రించగలిగితే మీరు బయటపడినట్లే. తరచూ చెక్ చేసుకోండి’ అని వైద్యులు చెబుతున్నారు.