News January 15, 2025
ఆర్మీ డే ఇవాళే ఎందుకంటే?

భారత సైన్యాన్ని అధికారికంగా ఏప్రిల్ 1, 1895న స్థాపించారు. స్వాతంత్ర్యం తర్వాత చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ భారతదేశానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ మదప్ప కరియప్ప అనే కమాండర్‌కు ఇదే రోజున 1949లో బాధ్యతలు అప్పగించారు. దీనిని స్మరిస్తూ ప్రతి ఏటా JAN 15న ఆర్మీ డే నిర్వహిస్తున్నారు. ఈ రోజున సైనికుల శౌర్యాన్ని, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వేడుకలు చేస్తారు.
Similar News
News February 12, 2025
పబ్లిక్‌లో పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదు: ఢిల్లీ కోర్టు

బార్‌లో అశ్లీల నృత్యం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు మహిళలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. బహిరంగంగా పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదంది. వారి డాన్స్ ప్రజలకు చిరాకు కలిగిస్తేనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పొట్టి దుస్తులు ధరించి అశ్లీల డాన్స్ చేశారంటూ గత ఏడాది పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనివల్ల ఇబ్బందిపడిన సాక్షులను ప్రవేశపెట్టడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది.
News February 12, 2025
పడిపోయిన ఎలాన్ మస్క్ ఆస్తి

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆస్తి 400 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. టెస్లా షేర్ల విలువ 27శాతం పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. సంస్థ కార్ల అమ్మకాలు భారీగా తగ్గడం దాని షేర్ల విలువపై ప్రభావం చూపించింది. గడచిన వారంలో 11శాతం మేర షేర్ల విలువ పడిపోవడం గమనార్హం. డోజ్ శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వ పెట్టుబడుల్ని ఆయన తగ్గించడం టెస్లా ఇన్వెస్టర్లకు నచ్చడం లేదని బిజినెస్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
News February 12, 2025
బూతులతో రెచ్చిపోయిన నటుడు పృథ్వీ

హైబీపీతో బాధపడుతూ HYDలోని ఓ <<15429041>>ఆస్పత్రిలో చేరిన<<>> నటుడు పృథ్వీరాజ్ వైసీపీ శ్రేణులపై బూతులతో రెచ్చిపోయారు. ‘11 అనే మాట వస్తే వైసీపీ వాళ్లు గజగజ వణికిపోతున్నారు. సినిమాను సినిమాగా చూడండి. నా తల్లిని నీచంగా మాట్లాడుతున్నారు కదరా’ అంటూ రాయడానికి వీలులేని తీవ్ర అసభ్య పదజాలంతో దుయ్యబట్టారు. కాగా ‘లైలా’ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే.