News April 2, 2025

బీసీల డిమాండ్‌ను బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదు: సీఎం

image

రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘాలు చేపట్టిన ధర్నాలో రేవంత్ పాల్గొన్నారు. బీసీల లెక్క తెలియకుండా రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని కోర్టులు చెప్పాయని, అందుకే బీసీ కులగణన చేపట్టామని చెప్పారు. బీసీల డిమాండ్ న్యాయబద్ధమైనదని, దీన్ని బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు.

Similar News

News April 22, 2025

IPL: ‘టాప్’ లేపుతున్న గుజరాత్

image

ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు అంచనాలను తలకిందులు చేస్తూ అదరగొడుతోంది. కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి టేబుల్‌ టాపర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు సైతం ఆ జట్టు వద్దే ఉన్నాయి. ఓపెనర్ సాయి సుదర్శన్ 417 రన్స్, బౌలర్ ప్రసిద్ధ్ 16 వికెట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. సాయి సుదర్శన్, గిల్, బట్లర్‌తో GT టాప్ ఆర్డర్ దుర్భేద్యంగా ఉంది.

News April 22, 2025

866 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు

image

AP: ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీపై ఏపీపీఎస్సీ ఫోకస్ చేసింది. వివిధ శాఖల్లో 866 పోస్టుల భర్తీకి 18 నోటిఫికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. నెల రోజుల్లో రోస్టర్ పాయింట్ల ఖరారు తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు అగ్రికల్చర్, రవాణా, మున్సిపల్, జైళ్లు తదితర శాఖల్లో ఖాళీలున్నాయి.

News April 22, 2025

ట్రంప్‌కు షాక్.. కోర్టుకెక్కిన హార్వర్డ్ యూనివర్సిటీ

image

యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌పై హార్వర్డ్ యూనివర్సిటీ మసాచుసెట్స్‌లోని ఫెడరల్ కోర్టులో దావా వేసింది. $2.2 బిలియన్ల <<16113020>>ఫండ్స్ <<>>నిలిపేస్తామని బెదిరింపులకు పాల్పడటంపై లీగల్ యాక్షన్‌కు సిద్ధమైంది. యూనివర్సిటీ ప్రెసిడెంట్ అలన్ గార్బర్ మాట్లాడుతూ ‘ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బలవంతంగా హార్వర్డ్‌ను తమ అధీనంలోకి తీసుకోవాలని చూస్తోంది. దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు.

error: Content is protected !!