News December 16, 2024

హెడ్‌కు రోహిత్ శర్మపై ఎందుకంత కోపం!

image

ఇండియాతో మ్యాచ్ అంటే చాలు AUS బ్యాటర్ హెడ్ భారీ ఇన్నింగ్స్ ఆడేస్తున్నారు. అయితే అతను భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉన్నప్పుడు మాత్రమే బాగా ఆడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రోహిత్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు గత 6 ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు చేసిన అతను, ఇతరులు IND కెప్టెన్‌గా ఉన్నప్పుడు 25 ఇన్నింగ్స్‌లలో ఒక్క శతకం కూడా బాదలేదు. దీంతో ‘హెడ్‌కు రోహిత్‌పై కోపమెందుకు?’ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News November 14, 2025

రాష్ట్రంలో BAM ₹1.1 లక్షల కోట్ల పెట్టుబడి: లోకేశ్

image

AP: ప్రముఖ బ్రూక్‌ఫీల్డ్ అసెట్స్ మేనేజ్మెంట్(BAM) కంపెనీ రాష్ట్రంలో ₹1.1 లక్షల CR పెట్టుబడి పెట్టనుందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. రెన్యువబుల్ ఎనర్జీ, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజీ, సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో నిధులు వెచ్చించనుందని తెలిపారు. డేటా సెంటర్, రియల్ ఎస్టేట్, GCC, పోర్టులలోనూ పెట్టుబడి పెట్టనుందని ట్వీట్ చేశారు. వీటితో స్థిరమైన పెట్టుబడుల గమ్యస్థానంగా AP మారుతుందని పేర్కొన్నారు.

News November 14, 2025

బీజేపీకి షాక్.. డిపాజిట్ గల్లంతు

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ దక్కించుకోలేకపోయారు.

News November 14, 2025

శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందాలంటే?

image

తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం|
ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ||
శాశ్వతమైన పరమాత్మను నిరంతరం ఆరాధించాలని, ఆయననే ప్రధానంగా పూజించాలని ఈ శ్లోకార్థం. భగవంతుడ్ని ధ్యానిస్తూ, స్తుతిస్తూ, నమస్కరిస్తూ, ప్రతి కర్మనూ అంకితం చేయాలి. ప్రతి ఆలోచన ఆ పరమాత్మకే అర్పించాలి. తద్వారానే ఆయన అనుగ్రహం పొందగలం. అందుకే అనుక్షణం పరమాత్మ చింతనతో జీవించాలని పండితులు చెబుతారు.<<-se>>#VISHNUSAHASRANAMAM<<>>