News June 27, 2024

ISSను ఎందుకు డీకమిషన్ చేస్తున్నారంటే?

image

1998లో లాంచ్ అయిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ జీవితకాలం చివరిదశకు చేరడంతో నాసా దీనిని <<13518250>>డీకమిషన్<<>> చేయాలని నిర్ణయించింది. నిర్వహణ భారం, ప్రైవేట్ సంస్థలకు కొత్త స్పేస్ స్టేషన్ నిర్మాణ బాధ్యతలు అప్పగించాలనే ప్లాన్ ఉండటం ఇతర కారణాలు. ISS నిర్వహణలో USకు రష్యా, ఐరోపా సహకరిస్తూ వచ్చాయి. 2022లో నాసా డీకమిషన్ ప్లాన్ ప్రతిపాదించింది. కాగా సొంతంగా స్పేస్ స్టేషన్ లాంచ్ చేస్తామని అదే ఏడాది రష్యా ప్రకటించింది.

Similar News

News December 9, 2025

మీకు ఈ అలవాట్లు ఉన్నాయా?

image

కొన్ని అలవాట్లు అశుభకరమని పండితులు చెబుతున్నారు. ‘మాటిమాటికి ప్రతిజ్ఞలు చేయడం, ఒట్లు వేయడం దోషం. నిలబడి, తిరుగుతూ అన్నం తింటే దరిద్రులవుతారు. నోట్లో వేళ్లు పెట్టుకోవడం, గోళ్లు కొరుక్కోవడం అశుభానికి సంకేతం. నదిలో ఉమ్మడం దైవ దూషణతో సమానం. కంచంను ఒడిలో పెట్టుకొని, పడుకొని తినకూడదు. కంచంలో చేయి కడగడం కూడా మంచిది కాదు. ఈ అలవాట్లు వీడితే శుభాలు కలిగి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది’ అని సూచిస్తున్నారు.

News December 9, 2025

PHC స్థాయిలోనే స్క్రబ్ టైఫ‌స్ నిర్ధారణ పరీక్షలు

image

AP: స్క్రబ్ టైఫ‌స్ జ్వరాల నిర్ధారణ పరీక్షల నమూనాలను PHC స్థాయిలోనే సేకరిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,566 స్క్రబ్ టైఫ‌స్ జ్వరాల కేసులు నమోదైనట్లు చెప్పారు. 9 మరణాలూ అనుమానిత కేసులు మాత్రమే అని, లోతైన పరీక్షలకు జీనోమ్ సీక్వెన్స్ చేయిస్తున్నామన్నారు. కుట్టినట్లు అనిపించిన శరీర భాగంపై నల్లటి మచ్చ కనిపిస్తే అప్రమత్తం కావాలని సూచించారు.

News December 9, 2025

చలికాలం కదా అని!

image

చలికాలంలో చాలామంది నీరు తాగడంపై అశ్రద్ధ వహిస్తారు. అయితే ఈ కాలంలోనూ డీహైడ్రేషన్‌‌ ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘డైలీ 6-9 గ్లాసుల నీళ్లు తాగాలి. వాటర్‌ తాగాలని అనిపించకపోతే సూప్‌లు, టీలు తీసుకోవడం ద్వారా శరీరానికి తగినంత ప్లూయిడ్ అంది జీవక్రియ మెరుగవుతుంది’ అని చెబుతున్నారు. అలాగే శరీరాన్ని స్వెటర్లతో కప్పి ఉంచకుండా సూర్యరశ్మి పడేలా చూసుకుంటే D-విటమిన్ అందుతుందని సూచిస్తున్నారు.