News September 15, 2024
వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు?
ఇప్పుడైతే వినాయకులను POPతో చేస్తున్నారుగానీ ఒకప్పుడు చెరువులోని స్వచ్ఛమైన ఒండ్రుమట్టితోనే తయారుచేసేవారు. లంబోదరుడిని పూజించే 21రకాల పత్రిల్లో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ప్రవహించే నదులు, వాగులతో పాటు చెరువుల్లోని నీరు సర్పాలు ఇతర కీటకాలతో విషపూరితమవుతాయి. ఒండ్రుమట్టి వినాయకులను నిమజ్జనం చేసి, పత్రిలను వాటిలో వదిలితే నీరు శుద్ధి అవడంతో పాటు ఔషధగుణాలు కలగలుస్తాయని పండితులు చెబుతున్నారు.
Similar News
News October 9, 2024
జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి జిల్లా కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఈనెల 14న తీర్పును వెల్లడిస్తామని తెలిపింది. అత్యాచారం కేసులో అరెస్టయిన జానీ మాస్టర్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
News October 9, 2024
‘అన్‌స్టాపబుల్’ షోలో బాలయ్యతో అల్లు అర్జున్!
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ షోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. వీరిద్దరి కాంబోలో ‘పుష్ప’ రిలీజ్ సమయంలో ఓ ఎపిసోడ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ‘పుష్ప-2’ రిలీజ్‌కు ముందు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే ప్రకటన రానున్నట్లు సమాచారం.
News October 9, 2024
GOOD NEWS: ఫోర్టిఫైడ్ రైస్ సప్లై గడువు పెంపు
విటమిన్లు కలిపిన ఉచిత ఫోర్టిఫైడ్ రైస్‌ను 2028 వరకు ఇవ్వాలని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది. PMGKAY, ఇతర వెల్ఫేర్ స్కీంల కింద వీటిని సరఫరా చేసేందుకు ఆమోదించింది. ఇందుకయ్యే పూర్తి ఖర్చు రూ.17,082 కోట్లకు కేంద్రమే భరించనుంది. 2019-21 మధ్య చేసిన హెల్త్ సర్వేలో దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లలో రక్తహీనత, విటమిన్ల లోపం ఎక్కువగా ఉందని తేలింది. ఈ బియ్యాన్ని ఫ్రీగా ఇస్తున్న సంగతి తెలిసిందే.