News August 9, 2024

పుట్టలో పాలు ఎందుకు పోస్తారు?

image

పురుగులు, కీటకాల నుంచి పాములు పొలాలకు రక్షణ కల్పిస్తాయి. వాటికి ఏదైనా అపాయం చేస్తామనే భయంతో అవి మనపై, అవి ఎక్కడ కాటేస్తాయనే భయంతో మనం వాటిపై దాడి చేస్తాం. దీంతో మనుషులు, పాముల మధ్య ఉన్న భయాన్ని పోగొట్టేందుకు, రైతులకు సాయపడే సర్పాలు అంతరించిపోకుండా పెద్దలు నాగుల పంచమికి పుట్టలో పాలు పోయాలనే ఆచారాన్ని తీసుకొచ్చారట. ఇలా పాలు పోసి నాగదేవతలను దర్శించుకోవడం వల్ల సర్ప దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.

Similar News

News September 19, 2025

తిరుమలలో ప్లాస్టిక్ ఇస్తే రూ.5!

image

AP: ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు తిరుమల పీఏసీ-5లో రీసైక్లింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ Reklaim Ace యంత్రం పనితీరును అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి నిన్న పరిశీలించారు. భక్తులు ఈ యంత్రంలో టెట్రా ప్యాక్స్, స్నాక్స్ ప్యాకెట్లు వదిలివేయవచ్చని, అందుకోసం UPI ద్వారా లాగిన్ అయ్యి QR కోడ్ స్కాన్ చేయాలని అధికారులు తెలిపారు. రింగ్‌లో ప్లాస్టిక్ వదిలివేసే వారికి రూ.5 ప్రోత్సాహకంగా లభిస్తుందన్నారు.

News September 19, 2025

పోలీస్ కస్టడీకి మిథున్ రెడ్డి.. విజయవాడకు తరలింపు

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడకు తరలించారు. ఆయన్ను 5 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరగా కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన్ను అధికారులు ఇవాళ, రేపు విచారించనున్నారు. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్న విషయం తెలిసిందే.

News September 19, 2025

రైల్వేకు ‘మహిళా శక్తి’ని పరిచయం చేసిన సురేఖ

image

ఆడవాళ్లు రైలు నడుపుతారా? అనే ప్రశ్నలను, అడ్డంకులను దాటుకుని ఆసియాలోనే తొలి మహిళా లోకోపైలట్‌గా మారిన సురేఖా యాదవ్(మహారాష్ట్ర) పదవీ విరమణ పొందారు. ఆమె తన అసాధారణ ప్రయాణంలో ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. 1988లో అసిస్టెంట్ లోకోపైలట్‌గా మొదలైన ఆమె ప్రయాణం డెక్కన్ క్వీన్ రైళ్లను నడిపే వరకూ సాగింది. ఆమె ఉద్యోగ జీవితం భారతీయ రైల్వేలో మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిపోతుంది.