News August 9, 2024
పుట్టలో పాలు ఎందుకు పోస్తారు?
పురుగులు, కీటకాల నుంచి పాములు పొలాలకు రక్షణ కల్పిస్తాయి. వాటికి ఏదైనా అపాయం చేస్తామనే భయంతో అవి మనపై, అవి ఎక్కడ కాటేస్తాయనే భయంతో మనం వాటిపై దాడి చేస్తాం. దీంతో మనుషులు, పాముల మధ్య ఉన్న భయాన్ని పోగొట్టేందుకు, రైతులకు సాయపడే సర్పాలు అంతరించిపోకుండా పెద్దలు నాగుల పంచమికి పుట్టలో పాలు పోయాలనే ఆచారాన్ని తీసుకొచ్చారట. ఇలా పాలు పోసి నాగదేవతలను దర్శించుకోవడం వల్ల సర్ప దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.
Similar News
News September 7, 2024
దేశవాళీలో DRS.. బీసీసీఐ భేష్: అశ్విన్
ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో బీసీసీఐ DRSను తీసుకురావడంపై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. దీని వల్ల దేశవాళీ క్రికెట్‌లో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని ఆయన ట్విటర్‌లో అభిప్రాయపడ్డారు. యువ క్రికెటర్లు సైతం తమ తప్పుల్ని తెలుసుకుని తమను తాము మెరుగుపరుచుకుంటారని అశ్విన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రికీ భుయ్ తాజాగా ఔటైన విధానాన్ని ఆయన ఉదాహరణగా వివరించారు.
News September 7, 2024
భారీగా తగ్గిన ఐఫోన్ ధర
సెప్టెంబర్ 9న ఐఫోన్ 16 సిరీస్ ఇండియాలో లాంచ్ కానుంది. దీంతో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల ధరలు భారీగా పడిపోతున్నాయి. గతేడాది ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లాంచ్ చేసినప్పుడు ధర రూ.1,59,900గా ఉండేది. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో దాని రేటు రూ.1,32,990కు పడిపోయింది. క్రెడిట్ కార్డులతో చెల్లిస్తే మరింత డిస్కౌంట్ ఇస్తున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర రూ.1.59 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
News September 7, 2024
ఆ మాటలతో అతని మెంటాలిటీ బయటపడింది: బజరంగ్ పునియా
పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ వైఫల్యంపై బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ <<14037088>>వ్యాఖ్యలతో<<>> అతని మెంటాలిటీ బయటపడిందని బజరంగ్ పునియా కౌంటర్ ఇచ్చారు. ఆమె ఓటమితో అతను సంతోషంగా ఉండొచ్చని విమర్శించారు. అది వినేశ్ మెడల్ మాత్రమే కాదని, 140 కోట్ల మంది ప్రజలదని పేర్కొన్నారు. ఇలా ఓటమిని సెలబ్రేట్ చేసుకునేవారిని దేశ భక్తులంటారా? అని ప్రశ్నించారు.