News December 9, 2024
చెక్‌పై అమౌంట్ పక్కన ‘Only’ ఎందుకు రాస్తారు?
ఈ డౌట్ మీకు వచ్చిందా? ఉదాహరణకు చెక్‌పై రూ.1,00,000 ఇలా రాసిన తర్వాత ONE Lakh Rupees Only రాయడం గమనించే ఉంటారు. చెక్ ట్యాంపర్ అవ్వకుండా, మనం రాసిన అమౌంట్ పక్కన నంబర్లు చేర్చకుండా ఉండేందుకు ఓన్లీ అని రాయడం ముఖ్యం. పదాలలో రాసి చివర ఓన్లీ అని రాయడం వల్ల సంఖ్యను మార్చినా, పదాలను ఛేంజ్ చేయలేదు. ఒకవేళ కొట్టేసి రాసినా అలాంటి చెక్కులను బ్యాంకులు అంగీకరించవు. మోసాలను నివారించడానికి Only మస్ట్.
Similar News
News January 21, 2025
నిర్మాత మనో అక్కినేని మృతి
తమిళ సినీ నిర్మాత మనో అక్కినేని మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 19న ఆమె కన్నుమూయగా సన్నిహితురాలు సుధ కొంగర ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన తొలి సినిమా ‘ద్రోహి’ని మనో నిర్మించి వెండితెరకు పరిచయం చేశారని గుర్తు చూసుకుంటూ సుధ ఎమోషనల్ పోస్ట్ చేశారు. సినిమాలే జీవితంగా వాటిని ప్రేమించిన వ్యక్తి దూరం కావడం బాధాకరమన్నారు. కొంగర జగ్గయ్య కుటుంబం నుంచి మనో వచ్చారు.
News January 21, 2025
తెలంగాణలో రాకెట్ తయారీకి ఒప్పందం
తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు HYDకు చెందిన స్కైరూట్ కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ దావోస్‌లో ఆ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. HYDకు చెందిన ఈ సంస్థ అత్యాధునిక సాంకేతిక రంగంలో విజయం సాధించడం గర్వంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలోనే HYDను ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామన్నారు.
News January 21, 2025
కోడిగుడ్డు తింటున్నారా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందనే కారణంతో చాలా మంది కోడిగుడ్డులోని పచ్చసొనను తినకుండా పారేస్తారు. కేవలం వైట్ మాత్రమే తింటారు. అయితే పచ్చసొనలో విటమిన్ A, D, E, B12, K, B2, B9 పుష్కలంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటితో ఎముకలు బలంగా మారుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తస్రావం అయితే బ్లడ్ త్వరగా గడ్డకడుతుంది. చర్మం ఎప్పుడూ హెల్తీగా ఉంటుంది. జీవక్రియ మెరుగుపడుతుంది.