News August 6, 2024
ఆశ్రయం UKలోనే ఎందుకు?

ఇంటర్నేషనల్ రెఫ్యూజీ చట్టంగా పరిగణించే 1951 రెఫ్యూజీ కన్వెన్షన్ (జెనీవా), దాని తరువాత విస్తృతపరిచిన 1967 ప్రోటొకాల్ ప్రకారం శరణార్థులకు UK రక్షణ కల్పిస్తుంది. ఒక దేశంలో తమకు రక్షణ లేదని, హింసకు గురవుతున్న కారణాలతో వచ్చే వారికి బ్రిటన్ ఆశ్రయం కల్పిస్తుంది. అంతేకాకుండా న్యాయపరంగా అన్ని హక్కులు కల్పిస్తుంది. వారి కోసం పునరావాస పథకాలను కూడా అమలు చేస్తోంది.
Similar News
News October 19, 2025
UKలో ఉండటంపై విరాట్ ఏమన్నారంటే?

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కొన్ని నెలలుగా ఫ్యామిలీతో కలిసి UKలో ఉంటున్న విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ్టి మ్యాచ్కు ముందు ఆయన స్పందించారు. ‘టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత నాకు చాలా సమయం దొరికింది. జీవితంలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు కుటుంబంతో కొంత సమయం గడపగలుగుతున్నా. ఇది ఒక అందమైన దశ. చాలా ఆనందంగా ఉన్నా. ఫ్రెష్గా, ఫిట్గా ఫీల్ అవుతున్నా’ అని చెప్పారు.
News October 19, 2025
గత ప్రభుత్వంలో ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి: CM

TG: గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని, ఇచ్చినా పరీక్షలు పెట్టలేదని సీఎం రేవంత్ విమర్శించారు. HYDలో సర్వేయర్లకు సీఎం లైసెన్సులు అందజేశారు. ‘గత ప్రభుత్వం పోటీ పరీక్షలు పెట్టినా ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి. TGPSC పునరావాస కేంద్రంగా ఉండేది. మేము రాగానే దాన్ని ప్రక్షాళన చేశాం. ఏడాదిలోనే 60వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశాం’ అని తెలిపారు.
News October 19, 2025
JEE మెయిన్-2026 షెడ్యూల్ వచ్చేసింది

JEE MAIN-2026 <