News August 6, 2024

ఆశ్ర‌యం UKలోనే ఎందుకు?

image

ఇంట‌ర్నేష‌నల్ రెఫ్యూజీ చ‌ట్టంగా ప‌రిగ‌ణించే 1951 రెఫ్యూజీ క‌న్వెన్ష‌న్ (జెనీవా), దాని త‌రువాత విస్తృత‌ప‌రిచిన 1967 ప్రోటొకాల్‌ ప్ర‌కారం శరణార్థులకు UK రక్షణ కల్పిస్తుంది. ఒక దేశంలో తమకు ర‌క్ష‌ణ లేద‌ని, హింస‌కు గురవుతున్న కార‌ణాలతో వ‌చ్చే వారికి బ్రిట‌న్ ఆశ్ర‌యం క‌ల్పిస్తుంది. అంతేకాకుండా న్యాయపరంగా అన్ని హ‌క్కులు క‌ల్పిస్తుంది. వారి కోసం పున‌రావాస ప‌థ‌కాల‌ను కూడా అమ‌లు చేస్తోంది.

Similar News

News September 14, 2024

వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నాశనం: మంత్రి నాదెండ్ల

image

AP: వైసీసీ చీఫ్ జగన్ తన పాలనలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార యంత్రాంగాన్ని సమన్వయపరిచినట్లు తెలిపారు. లీడర్ అంటే పవన్‌లా ఉండాలని, మీడియా ముందు కాగితాలు పట్టుకొని ఊగిపోవడం ఏంటన్నారు. నిజాయితీ ఉంటే ఆ పార్టీ యంత్రాంగం ప్రభుత్వ వరద సాయంలో భాగమవ్వాలన్నారు.

News September 14, 2024

ఎల్లుండి ఖైరతాబాద్ గణేశ్ దర్శనం లేదు

image

TG: ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక ప్రకటన చేసింది. సోమవారం మహాగణపతి దర్శనానికి అనుమతి లేదని చెప్పింది. శని, ఆదివారం మాత్రమే అనుమతి ఇస్తామని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. మంగళవారం నిమజ్జనం ఉండటంతో సోమవారం వెల్డింగ్ తదితర పనుల నేపథ్యంలో భక్తులను అనుమతించబోమని పేర్కొంది. కాగా మంగళవారం మధ్యాహ్నానికి లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు.

News September 14, 2024

వైద్యులు వర్షంలో ఉంటే నాకు నిద్ర పట్టలేదు: సీఎం మమత

image

కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనలో న్యాయం కోసం నిరసనలు చేస్తున్న వైద్యుల వద్దకు బెంగాల్ CM మమత ఈరోజు వెళ్లారు. వారు వర్షంలోనే నిరసనలు తెలుపుతుండటంతో తనకు రాత్రంతా నిద్రపట్టలేదని తెలిపారు. ‘నిరసనలు తెలియజేయడం మీ హక్కు. వాటికి సెల్యూట్ చేసేందుకే ఇక్కడికి వచ్చాను. నా పదవి కంటే మీ గొంతుకే ముఖ్యం. మీ డిమాండ్లన్నీ పరిశీలిస్తాను. నిందితుల్ని శిక్షిస్తాను. దయచేసి విధులకు హాజరుకండి’ అని కోరారు.