News July 15, 2024

Xiaomi క్రేజ్ ఎందుకు తగ్గిందంటే? – 2/2

image

పబ్లిక్ మిడ్ రేంజ్, ప్రీమియం రేంజ్ స్మార్ట్‌ఫోన్లకు ఆసక్తి చూపిస్తోందనే ట్రెండ్‌ను షావోమీ ఆలస్యంగా పసిగట్టిందనేది బిజినెస్ వర్గాల మాట. దీనిని శాంసంగ్, ఒప్పో, వివో వంటి బ్రాండ్లు క్యాష్ చేసుకున్నాయని చెబుతున్నాయి. గతంలో జరిగిన బాయ్‌కాట్ ట్రెండ్, అవకతవకలకు పాల్పడిందని $1 బిలియన్ విలువ చేసే ఆస్తులను ఈడీ ఫ్రీజ్ చేయడం, సంస్థ వృద్ధికి కీలకమైన మను జైన్ వైదొలగడం కూడా పతనానికి కారణం అయ్యాయని చెబుతున్నారు.

Similar News

News December 7, 2025

తల్లయిన హీరోయిన్ సోనారిక

image

టాలీవుడ్ హీరోయిన్ సోనారిక తల్లి అయ్యారు. ఈ నెల 5న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఇవాళ ఆమె ఇన్‌స్టాలో వెల్లడించారు. ‘దేవోం కే దేవ్ మహాదేవ్’ సీరియల్‌లో పార్వతీదేవిగా నటించిన ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో జాదూగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. గత ఏడాది వ్యాపారవేత్త వికాస్ పరాశర్‌ను వివాహం చేసుకున్నారు.

News December 7, 2025

తెలంగాణ దిశా దశను మార్చనున్న గ్లోబల్ సమ్మిట్: పొంగులేటి

image

TG: రేపటి నుంచి జరిగే గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ దిశా దశను మార్చనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఉన్నత నగరాల స్థాయికి ఫ్యూచర్ సిటీ చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 2047 లక్ష్యంగా సాగుతున్న ప్రణాళికలకు ఊతమిచ్చే విధంగా పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. సుమారు 150 మంది అత్యంత ప్రముఖులు ఈ సమ్మిట్‌లో పాల్గొనబోతున్నారని చెప్పారు.

News December 7, 2025

గొర్రె పిల్లలకు ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది?

image

గొర్రె పిల్లలకు పుట్టిన మొదటి రోజు నుంచి 20 వారాల వయసు వచ్చేవరకు వివిధ దశలలో సరిపడేంతగా పాలను, క్రీపు దాణాను, T.M.R(టోటల్‌ మిక్స్‌డ్‌ రేషన్‌)ను నిర్దేశిత పరిమాణంలో అందించాలి. వీటిని సరైన పరిమాణంలో అందిస్తే 5 లేదా 6 నెలల వయసులోనే గొర్రె పిల్లలు 28 నుంచి 30 కిలోల బరువు పెరుగుతాయి. దీని వల్ల త్వరగా వీటిని కోతకు అమ్మి మంచి ఆదాయం పొందవచ్చు. అలాగే వాటి మరణాల శాతాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.