News July 15, 2024
Xiaomi క్రేజ్ ఎందుకు తగ్గిందంటే? – 2/2
పబ్లిక్ మిడ్ రేంజ్, ప్రీమియం రేంజ్ స్మార్ట్‌ఫోన్లకు ఆసక్తి చూపిస్తోందనే ట్రెండ్‌ను షావోమీ ఆలస్యంగా పసిగట్టిందనేది బిజినెస్ వర్గాల మాట. దీనిని శాంసంగ్, ఒప్పో, వివో వంటి బ్రాండ్లు క్యాష్ చేసుకున్నాయని చెబుతున్నాయి. గతంలో జరిగిన బాయ్‌కాట్ ట్రెండ్, అవకతవకలకు పాల్పడిందని $1 బిలియన్ విలువ చేసే ఆస్తులను ఈడీ ఫ్రీజ్ చేయడం, సంస్థ వృద్ధికి కీలకమైన మను జైన్ వైదొలగడం కూడా పతనానికి కారణం అయ్యాయని చెబుతున్నారు.
Similar News
News October 13, 2024
రేపు మద్యం దుకాణాలకు లాటరీ
AP: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు 89,882 దరఖాస్తులు అందాయి. రూ.2లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో ఖజానాకు రూ.1,797 కోట్ల ఆదాయం లభించింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువ దరఖాస్తులు రావడంతో దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. రేపు లాటరీ పద్ధతిలో షాపులు కేటాయిస్తారు. ఎల్లుండి ప్రైవేట్ వ్యక్తులకు దుకాణాలు అప్పగిస్తారు. 16 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుంది.
News October 13, 2024
PM గతిశక్తి ఓ గేమ్ ఛేంజర్: మోదీ
రైల్వే నుంచి విమానాశ్రయాల వరకు 7 కీలక రంగాల సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా ‘PM గతిశక్తి’ దేశ మౌలిక సదుపాయాల రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. మల్టీమోడల్ కనెక్టివిటీ పెరిగి వివిధ రంగాల్లో సమర్థవంతమైన పురోగతికి తోడ్పడిందన్నారు. రవాణా వ్యవస్థ మెరుగుపడి ఆలస్యం తగ్గిందని, తద్వారా ఎంతో మంది కొత్త అవకాశాలను అందిపుచ్చుకున్నారని మోదీ పేర్కొన్నారు.
News October 13, 2024
ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా
శ్రేయస్ అనేక ప్రొడక్ట్ డిజైనర్ వర్క్‌ఫ్రం హోం కారణంగా ఓ సంస్థలో తక్కువ జీతానికి చేరారు. మొదటి రోజే 9 గంటలు కాకుండా 12-14 గంటలు పనిచేయాలని, అది కూడా కాంపెన్సేషన్ లేకుండా చేయాలని మేనేజర్ ఆదేశించారట. పైగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఓ ఫ్యాన్సీ పదమని తీసికట్టుగా మాట్లాడడంతో శ్రేయస్ ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా చేశారు. ఆ మెయిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరలైంది.