News November 20, 2024
బైకులకు టోల్ ట్యాక్స్ ఎందుకు ఉండదు?

నేషనల్ హైవేలపై వెళ్లేటప్పుడు ద్విచక్రవాహనదారులు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. బైకుల కోసం టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక మార్గం ఉంటుంది. ఇతర వాహనాలతో పోల్చితే బైకుల సైజు తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అలాగే బైకులు బరువు కూడా తక్కువగా ఉండటం వల్ల ఇతర వాహనాలతో పోల్చితే రోడ్డుపై అధిక భారం పడదు.
Similar News
News October 24, 2025
బస్ ఎక్కకుండా ప్రాణాలు దక్కించుకున్నాడు

కర్నూలు ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే బస్సులో TGకి చెందిన 15 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. వీరిలో తరుణ్ అనే యువకుడు మాత్రం చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకున్నారు. ఆయన సీట్ నంబర్ U-2లో టికెట్ బుక్ చేసుకున్నారు. HYD ప్యారడైజ్ వద్ద బోర్డింగ్ చేయాల్సి ఉండగా బస్ ఎక్కకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా బయపడ్డారు. మిగతా 14 మందిలో 8 మంది మరణించారు.
News October 24, 2025
రేపే నాగుల చవితి.. పెళ్లి కానివారు ఇలా చేస్తే?

పెళ్లికాని యువతీయువకులకు నాగుల చవితి వివాహ యోగం కల్పిస్తుందని పండితులు సూచిస్తున్నారు. ఈ శుభ దినాన నాగ దేవతను ఆరాధించి, పుట్టలో పాలు పోస్తే.. జాతకంలోని రాహుకేతువుల దుష్ప్రభావాలు తగ్గుతాయని అంటున్నారు. అలాగే వివాహ జీవితానికి ఆటంకం కలిగించే కుజ, కాల సర్ప దోషాలు తొలగి నాగ దేవత అనుగ్రహంతో తగిన జీవిత భాగస్వామి లభిస్తారని పేర్కొంటున్నారు. ☞ మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీ వెళ్లండి.
News October 24, 2025
340 ప్రొబేషనరీ ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


