News August 14, 2024

ట్యాబ్లెట్లపై ఈ రెడ్ లైన్ ఎందుకు ఉంటుంది?

image

కొన్ని ట్యాబ్లెట్ల వెనకవైపు రెడ్ కలర్ లైన్ ఉంటుంది. ప్రధానంగా యాంటీబయాటిక్స్‌లో కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే ఈ ట్యాబ్లెట్లు వాడటానికి డాక్టర్‌ సలహా తప్పనిసరి. ఇష్టానుసారం ఈ మెడిసిన్ తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. అందుకే మీరు ట్యాబ్లెట్ల ఎక్స్‌పైరీ డేట్‌తో పాటు ఈ రెడ్ లైన్ కూడా గమనించడం ముఖ్యం. > SHARE

Similar News

News December 21, 2025

స్వయంకృషి: బేసిక్స్‌లో రెండోది.. బెస్ట్ Income!

image

బిజినెస్ స్టార్ట్ చేయాలా? ఫుడ్ బెస్ట్ ఛాయిస్. మనిషికి ‘కూడు, గూడు, గుడ్డ’ కనీస అవసరాలు. ప్రాధాన్యతల వారీగా బట్టల తర్వాత ఆహారం తప్పనిసరి. మార్కెట్లో చాలా ఫుడ్ సెంటర్స్, రెస్టారెంట్స్ ఉన్నా క్వాలిటీ క్వశ్చన్ ప్రజల్ని వెంటాడుతోంది. మీరు క్వాలిటీపై ఫోకస్ పెట్టి టీ అమ్మినా మంచి ఆదాయం చూస్తారు. సరైన వర్కర్లు, వాళ్లు లేకపోయినా చేసుకోగల సామర్థ్యం ఉంటే మీకు తిరుగుండదు.
-డైలీ 1pmకు ఓ బిజినెస్ ఐడియా

News December 21, 2025

ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

image

<>ముంబై <<>>పోర్ట్ అథారిటీలో 5 కాంట్రాక్ట్ జూనియర్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం రూ.40,000లతో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. షార్ట్ లిస్ట్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in

News December 21, 2025

సమస్త శక్తులకు మూలపురుషుడు ‘శివుడు’

image

‘ఓం ప్రభవే నమః’ – శివుడు సమస్త లోకాలకు, శక్తులకు మూలపురుషుడు. సర్వాధిపతి కూడా! ఆయన ఆజ్ఞ లేనిదే అణువు కూడా కదలదు. సృష్టి, స్థితి, లయకారక శక్తులన్నీ ఆయన నుంచే ఉద్భవిస్తాయి. అత్యంత సమర్థుడు, ఐశ్వర్యవంతుడైన ఆయన మన కష్టాలు తీర్చి, సన్మార్గాన్ని చూపుతాడు. అంతులేని అధికారమున్నా.. తనను నమ్మిన వారిపై అపారమైన కరుణ చూపుతాడు. మన జీవితాలను నడిపించే ఆ సర్వవ్యాపక శక్తికి ఈ నామం గొప్ప ప్రణామం. <<-se>>#SHIVANAMAM<<>>