News January 9, 2025
వైకుంఠ ద్వార దర్శనం 10రోజులెందుకు?: సీఎం చంద్రబాబు

AP: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాన్ని 10రోజుల పాటు జరపడాన్ని సీఎం చంద్రబాబు వ్యతిరేకించారు. ‘వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అనేవి పవిత్రమే కానీ దాన్ని పది రోజులెందుకు చేశారో నాకు తెలియడం లేదు. స్వామివారు ఇక్కడ వెలువడినప్పటి నుంచీ పాటించే సంప్రదాయాల్ని మార్చకుండా అనుసరించాలనేది నా అభిప్రాయం. ఆ విషయంలో ఆగమ పండితులు తుది నిర్ణయం తీసుకుంటారు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 3, 2025
సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్

TG: తరం మారింది. తలరాతలు మార్చే ప్రచార వేదికలూ మారుతున్నాయి. ప్రతి ఒక్కరి చేతుల్లోని స్మార్ట్ ఫోన్ను చేరేలా పంచాయతీ అభ్యర్థుల ప్రచారం సాగుతోంది. దీంతో గోడలపై, ఇళ్లకు పోస్టర్లు, మైకుల సందడికి సోషల్ మీడియా అదనంగా చేరింది. రెగ్యులర్ ఆఫ్లైన్ క్యాంపెయిన్లతో పాటు వాట్సాప్లో వీడియోలతోనూ ఓటు అభ్యర్థిస్తున్నారు. ఊరి వాట్సాప్ గ్రూప్స్లో డిస్కషన్స్ పోల్స్ రిజల్ట్ను బట్టి హామీలు, వ్యూహాలూ మారుతున్నాయి.
News December 3, 2025
విష్ణుమూర్తి నామాల్లోనే ఆయన మహిమలు

అగ్రాహ్య శ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః|
ప్రభూత స్త్రికకుబ్ధామ ప్రవిత్రం మంగళం పరమ్||
విష్ణుమూర్తి అగ్రాహ్యుడు. అంటే ఆయన గురించి తెలుసుకోవడం అసాధ్యం. అలాగే శాశ్వతుడు, చీకటిని పాలద్రోలే శ్రీకృష్ణుడు. ఆయనే ఎర్రటి కనుల లోహితాక్షుడు. ప్రతర్దనః, ప్రభూతః కూడా విష్ణువే. 3 లోకాలలను పాలించే పవిత్రుడు, మంగళ స్వరూపుడు, వెలుగునే తన మార్గంగా మార్చుకున్న నారాయణుడే మన ఆది దేవుడు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 3, 2025
శీతాకాలంలో జుట్టు ఎక్కువగా రాలుతోందా?

మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో జుట్టు సమస్యలు అధికమవుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే కొన్నిజాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. వారానికి రెండుసార్లు గోరువెచ్చటి నీటితో తలస్నానం చెయ్యాలి. తర్వాత కండిషనర్ తప్పనిసరి. ఈ కాలంలో బ్లో డ్రైయ్యర్స్ వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది. అలాగే ఈ సీజన్లో వెంట్రుకలకు ఎంత తరచుగా ఆయిల్ పెడితే అంత మంచిది. ఇది జుట్టులోని తేమ శాతం ఎక్కువసేపు ఉండటానికి సహాయపడుతుంది.


