News January 9, 2025
వైకుంఠ ద్వార దర్శనం 10రోజులెందుకు?: సీఎం చంద్రబాబు
AP: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాన్ని 10రోజుల పాటు జరపడాన్ని సీఎం చంద్రబాబు వ్యతిరేకించారు. ‘వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అనేవి పవిత్రమే కానీ దాన్ని పది రోజులెందుకు చేశారో నాకు తెలియడం లేదు. స్వామివారు ఇక్కడ వెలువడినప్పటి నుంచీ పాటించే సంప్రదాయాల్ని మార్చకుండా అనుసరించాలనేది నా అభిప్రాయం. ఆ విషయంలో ఆగమ పండితులు తుది నిర్ణయం తీసుకుంటారు’ అని పేర్కొన్నారు.
Similar News
News January 20, 2025
ట్రంప్ మంచి మాట చెప్పావ్: పుతిన్
మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నిలువరిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతిచ్చారు. ‘ట్రంప్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నా. రష్యాతో నేరుగా సంబంధాలు పెట్టుకుంటానని ట్రంప్ చెప్పడం మంచిదే. అమెరికా కొత్త పాలకవర్గంతో చర్చలు జరుపుతాం’ అని పుతిన్ వ్యాఖ్యానించారు. కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పశ్చిమాసియాలో యుద్ధాలను ఆపుతానని ట్రంప్ నిన్న చెప్పారు.
News January 20, 2025
బన్నీ రికార్డును బ్రేక్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’!
విక్టరీ వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. సంక్రాంతి బరిలో 6 రోజుల్లోనే రూ.180+ కోట్లు కలెక్ట్ చేసి అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ ఈ రికార్డు అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’పై(వారంలో రూ.180 కోట్లు) ఉండేది. వెంకీ చిత్రం కోసం ఫ్యామిలీలు క్యూ కడుతుండటంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి.
News January 20, 2025
త్వరలో వాట్సాప్‌లోనే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
AP: జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను త్వరలో వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు సీఎస్ విజయానంద్ తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్, ఏపీ సీఆర్ఎస్ అమలుపై అధికారులతో ఆయన సమీక్షించారు. వాట్సాప్‌లో సర్టిఫికెట్లు జారీ చేసే విధానాన్ని మొదటగా తెనాలిలో ప్రయోగాత్మకంగా చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.