News August 15, 2024

IPSలను వెయిటింగ్‌లో ఉంచడం ఎందుకు?: RS ప్రవీణ్

image

ఏపీలో 16 మంది <<13850500>>IPSలకు<<>> రెగ్యులర్ పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టడాన్ని TGకి చెందిన మాజీ ఐపీఎస్ RS ప్రవీణ్ తప్పుపట్టారు. ‘గత నెల ఇద్దరు డీజీపీ ర్యాంకు ఆఫీసర్లపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఇప్పుడు ఈ 16 మంది IPSలను DGP ఆఫీసులో రోజూ వచ్చి సైన్ చేయాలంటున్నారు. ఆఫీసర్లను ఖాళీగా ఉంచే బదులు పోస్టింగ్ ఇస్తే ప్రజలకోసం పని చేస్తారు. అసలు ఏపీ పోలీస్ వ్యవస్థలో ఏం జరుగుతోంది?’ అని <>ట్వీట్<<>> చేశారు.

Similar News

News September 19, 2024

ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై పోలీసులకు గంగూలీ ఫిర్యాదు

image

తనను నెట్టింట ట్రోల్ చేస్తున్న ఓ వ్యక్తిపై చర్యల్ని కోరుతూ మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కోల్‌కతా పోలీసుల్ని ఆశ్రయించారు. ‘మృణ్మయ్ దాస్ అనే వ్యక్తి నన్ను లక్ష్యంగా చేసుకుని దూషిస్తూ కించపరిచే వ్యాఖ్యలతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోంది. దయచేసి వెంటనే అతడిపై చర్యలు తీసుకోండి’ అని గంగూలీ కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

News September 19, 2024

‘కూలీ’ మూవీ సీన్ లీక్‌పై డైరెక్టర్ రియాక్షన్

image

‘కూలీ’ మూవీ సీన్ లీక్ అవ్వడంపై డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ స్పందించారు. ‘ఒక్క రికార్డింగ్‌తో రెండు నెలలుగా మేం పడ్డ కష్టం వృథా అయింది. ఇలాంటివి ప్రోత్సహించొద్దని ప్రతి ఒక్కరిని కోరుతున్నా’ అని Xలో పోస్ట్ చేశారు. కాగా రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కూలీ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫైట్ సీన్‌లో నాగార్జున ఉన్న వీడియోను కొందరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

News September 19, 2024

అక్టోబర్ 3 నుంచి దసరా నవరాత్రులు

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకు లక్ష మందికి పైగా భక్తులు కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే అవకాశం ఉండటంతో వారికి తాగునీరు, పాలు, అల్పాహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజు అమ్మవారికి ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.