News May 4, 2024

అభ్యర్థుల ఖర్చుపై పరిమితి ఎందుకు?

image

ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచే అవకాశం అందరికీ సమానంగా కల్పించాలనే ఉద్దేశంతో వ్యయ పరిమితిని EC విధించింది. 1952 తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి ఖర్చు పెద్ద రాష్ట్రాల్లో గరిష్ఠంగా ₹25వేలు, చిన్న రాష్ట్రాల్లో ₹10వేలు. యాడ్స్, పోస్టర్లు, బ్యానర్లు, ప్రచారం, సభలు, వాహనాల వినియోగం ఇందులోకే వస్తాయి. ద్రవ్యోల్బణం, పెరిగిన ఖర్చును పరిగణనలోకి తీసుకుని EC వ్యయ పరిమితిని సవరిస్తూ ఉంటుంది.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News December 2, 2025

HYD: రైల్వే ఫుడ్‌లో బొద్దింక.. ప్రయాణికుల ఆగ్రహం

image

నాగపూర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తున్న ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేశారు. రైల్వే ఫుడ్ ఓపెన్ చేసి తినే సమయంలో ఒక్కసారిగా దాంట్లో బొద్దింక కనబడటంతో షాక్ అయ్యాడు. వెంటనే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆహార నాణ్యతపై చర్యలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రైల్వే పోలీసులను డిమాండ్ చేశారు.

News December 2, 2025

రాజ్ భవన్ ఇకపై ‘లోక్ భవన్’

image

గవర్నర్ అధికారిక నివాస, కార్యాలయ భవనం రాజ్ భవన్ పేరు మారింది. ‘లోక్ భవన్‌’గా మారుస్తూ గత నెల 25న కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇకపై దేశంలోని రాజ్ భవన్‌‌లను లోక్ భవన్‌గా పేర్కొనాలని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పేరు మార్చగా తెలుగు రాష్ట్రాల్లోనూ మార్చనున్నారు. కాగా దీనిపై రెండేళ్ల క్రితమే గవర్నర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

News December 2, 2025

హనుమాన్ చాలీసా భావం – 27

image

సబ పర రామ తపస్వీ రాజా। తినకే కాజ సకల తుమ సాజా॥
రాముడు రాజైనా రుషిలా నిగ్రహం, ధర్మపాలన కలవాడు. అలాంటి ధర్మమూర్తి సీతాన్వేషణ, లంకా విజయం వంటి ముఖ్య కార్యాలన్నీ ఆంజనేయుడే చక్కబెట్టాడు. హనుమంతుడు రామునికి కేవలం సేవకుడు కాదు, గొప్ప కార్యసాధకుడు. ఈ కథ మనకు కర్తవ్య నిష్ఠను బోధిస్తుంది. మన లక్ష్యం గొప్పదైనా, నిస్వార్థ సేవ, సంకల్పబలంతో తప్పక విజయం సాధించవచ్చు. <<-se>>#HANUMANCHALISA<<>>