News May 4, 2024
అభ్యర్థుల ఖర్చుపై పరిమితి ఎందుకు?
ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచే అవకాశం అందరికీ సమానంగా కల్పించాలనే ఉద్దేశంతో వ్యయ పరిమితిని EC విధించింది. 1952 తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి ఖర్చు పెద్ద రాష్ట్రాల్లో గరిష్ఠంగా ₹25వేలు, చిన్న రాష్ట్రాల్లో ₹10వేలు. యాడ్స్, పోస్టర్లు, బ్యానర్లు, ప్రచారం, సభలు, వాహనాల వినియోగం ఇందులోకే వస్తాయి. ద్రవ్యోల్బణం, పెరిగిన ఖర్చును పరిగణనలోకి తీసుకుని EC వ్యయ పరిమితిని సవరిస్తూ ఉంటుంది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News November 4, 2024
పుష్ప-2 క్రేజ్ మామూలుగా లేదుగా!
అల్లు అర్జున్ ‘పుష్ప-2’ మూవీ మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రానుంది. కేరళలో ఇప్పటికే 50 ఫ్యాన్స్ షోలకు బుకింగ్ స్టార్ట్ అయినట్లు డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించారు. కేరళలో మొత్తం 300కు పైగా ఫ్యాన్స్ షోలు ప్రదర్శించడమే తమ టార్గెట్ అని పేర్కొన్నారు. DEC5న కేరళలో వైల్డెస్ట్ మాస్ ఫెస్టివల్ ప్రారంభం కానుందంటూ Xలో పోస్ట్ చేశారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రష్మిక, ఫహాద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్నారు.
News November 4, 2024
టెన్షన్ పెడుతున్న ఇంటర్ పరీక్షలు
TG: ఇంటర్ పరీక్షలు అధికారులను, విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏటా అక్టోబర్‌లోనే పరీక్షల ఏర్పాట్లను ప్రారంభించాల్సి ఉండగా, ఇంకా ఎగ్జామ్ డేట్స్ ప్రకటించలేదు. మరోవైపు పలు కాలేజీలకు గుర్తింపూ ఇవ్వలేదు. అటు గెస్ట్ లెక్చరర్లను ఆలస్యంగా తీసుకోవడంతో వార్షిక పరీక్షలు సమీపిస్తున్నా సిలబస్ పూర్తికాలేదని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు వాపోతున్నారు. పరీక్షలు ఎలా రాయాలని వారు ప్రశ్నిస్తున్నారు.
News November 4, 2024
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ఆపేస్తా: కమలా హారిస్
అమెరికా ఎన్నికల్లో గెలిస్తే గాజాలో యుద్ధం ముగించేందుకు ప్రయత్నిస్తానని కమలా హారిస్ అన్నారు. పాలస్తీనా ప్రజల హక్కుల్ని కాపాడతానని, బందీలను విడిపించి ఇజ్రాయెల్ రక్షణకు కట్టుబడి ఉంటానని హామీలు ఇచ్చారు. ‘ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో ప్రజల రక్షణ కోసం దౌత్యపరంగా పనిచేస్తాను. USలో కొత్త నాయకత్వానికి ఇదే సరైన టైమ్. ప్రెసిడెంట్‌గా దానిని అందిస్తాను. మిడిల్‌క్లాస్ బాధలు తీరుస్తాను’ అని పేర్కొన్నారు.