News July 12, 2024

విద్యార్థులకు కొత్త పేరుతో సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వరు?: HC

image

TG: విద్యార్థి పేరు మార్చుతూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చాక కొత్త పేరుతో మరో సర్టిఫికెట్ ఇవ్వడానికి అభ్యంతరం ఏంటని SSC, ఇంటర్ బోర్డును హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం అనుమతిచ్చాక ఆ పేరే అమల్లోకి వస్తుందని, సర్టిఫికెట్లలో మార్పు అనవసరమని బోర్డు తరఫు న్యాయవాది అన్నారు. అయితే భవిష్యత్తులో పేరు మారిన కారణంగా ఆ విద్యార్థి దరఖాస్తు తిరస్కరణకు గురైతే ఆ నష్టం ఎవరు భరిస్తారని కోర్టు ప్రశ్నించింది.

Similar News

News December 11, 2025

NZB: 11 గంటల వరకు 50.73 శాతం పోలింగ్

image

తొలి దశ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 11 మండలాల్లోని 164 GPల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
బోధన్ మండలంలో 62.34%,
చందూరు-48.54%
కోటగిరి- 48.12%
మోస్రా-38.22%
పోతంగల్- 53.03%
రెంజల్- 58.93%
రుద్రూరు-55.85%
సాలూర- 55.95%
వర్ని- 54.91%
ఎడపల్లి-47.58%
నవీపేట – 37.77% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వివరించారు.

News December 11, 2025

థాయ్‌లాండ్‌లో పట్టుబడిన లూథ్రా బ్రదర్స్‌

image

గోవా నైట్‌క్లబ్ <<18509860>>ప్రమాదం<<>>లో కీలక నిందితులు గౌరవ్, సౌరభ్ లూథ్రా థాయ్‌లాండ్‌లో పట్టుబడ్డారు. డిసెంబర్‌ 7న రాత్రి క్లబ్‌లో మంటలు చెలరేగి 25 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే వీరిద్దరూ పరారయ్యారు. నిబంధనల ఉల్లంఘనే ప్రమాదానికి కారణంగా పోలీసులు తేల్చారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. త్వరలో లూథ్రా బ్రదర్స్‌నూ భారత్‌కు తీసుకురానున్నారు.

News December 11, 2025

సోనియాగాంధీతో CM రేవంత్ భేటీ

image

ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించిన తీరును ఆమెకు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల వారి నుంచి సదస్సుకు వచ్చిన స్పందన, పెట్టుబడుల గురించి వివరించారు. ₹5.75 లక్షల కోట్ల ఇన్వెస్టుమెంట్లకు జరిగిన ఒప్పందాలను చెప్పారు. రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించారు.