News July 12, 2024
విద్యార్థులకు కొత్త పేరుతో సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వరు?: HC

TG: విద్యార్థి పేరు మార్చుతూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చాక కొత్త పేరుతో మరో సర్టిఫికెట్ ఇవ్వడానికి అభ్యంతరం ఏంటని SSC, ఇంటర్ బోర్డును హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం అనుమతిచ్చాక ఆ పేరే అమల్లోకి వస్తుందని, సర్టిఫికెట్లలో మార్పు అనవసరమని బోర్డు తరఫు న్యాయవాది అన్నారు. అయితే భవిష్యత్తులో పేరు మారిన కారణంగా ఆ విద్యార్థి దరఖాస్తు తిరస్కరణకు గురైతే ఆ నష్టం ఎవరు భరిస్తారని కోర్టు ప్రశ్నించింది.
Similar News
News February 18, 2025
భారత్-పాక్ సరిహద్దుల్లో టెన్షన్

భారత్-పాక్ సరిహద్దుల్లోని పీర్‌పంజల్ ప్రాంతంలో(J&K) నియంత్రణ రేఖ(LOC) వెంబడి టెన్షన్ వాతావరణం నెలకొంది. పాక్‌కు చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్(BAT) కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడమే దీనిక్కారణం. సరిహద్దు ఆవలి నుంచి కాల్పులు జరుపుతూ భారత బలగాల్ని రెచ్చగొట్టేందుకు పాక్ యత్నిస్తోంది. మరోవైపు.. సీజ్‌ఫైర్ ఉల్లంఘన జరగలేదని, అధికారికంగా అమల్లోనే ఉందని భారత్ చెబుతుండటం ఆసక్తికరంగా మారింది.
News February 18, 2025
నేటి నుంచి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు

ఎల్‌నినో, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా ఈసారి ఎండాకాలం ముందే వచ్చేసిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు ఉంటాయని, అనేక ప్రాంతాల్లో 38డిగ్రీలు నమోదవుతాయంటున్నారు. ఇక APలో సాధారణం కంటే 2-4డిగ్రీలు గరిష్ఠంగా ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. విజయనగరం, అనకాపల్లి, విశాఖ, విజయవాడ, గుంటూరు, రాయలసీమ జిల్లాలపై ప్రభావం ఎక్కువని అంచనా.
News February 18, 2025
నేడు కుంభమేళాకు పవన్ కళ్యాణ్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ యూపీలోని ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. నిన్న మంత్రి నారా లోకేశ్ దంపతులు కూడా కుంభమేళాకు వెళ్లిన విషయం తెలిసిందే.