News May 24, 2024

రేవంత్‌ను ఎందుకు జైల్లో పెట్టకూడదు?: కేటీఆర్

image

ఫేక్ వార్తల ప్రచారానికి అలవాటు పడ్డ CM రేవంత్‌ను జైల్లో ఎందుకు పెట్టకూడదంటూ KTR ప్రశ్నించారు. ‘నా బంధువుకు ₹10,000కోట్ల కొవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్ అబద్ధం చెప్పాడు. నేను సెక్రటేరియట్ కింద ఉన్న నిజాం ఆభరణాలను తవ్వినట్లు నకిలీ కథనాన్ని సృష్టించాడు. కేంద్ర హోంమంత్రికి సంబంధించిన ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేశారు. ఓయూకి సంబంధించిన నకిలీ సర్క్యులర్‌ను పోస్ట్ చేశాడు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News February 13, 2025

పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లాడిన ట్రంప్

image

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు US అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్, AI, ఎనర్జీ, పవర్ ఆఫ్ డాలర్‌తో పాటు పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఇరు దేశాల చరిత్ర, బలాలపై మాట్లాడుకున్నామని, త్వరలో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణనష్టాన్ని ఆపాలనుకుంటున్నామని చెప్పారు. త్వరలో ఒకరి దేశంలో మరొకరు సందర్శిస్తామన్నారు.

News February 13, 2025

వన్డేల్లో పాకిస్థాన్ రికార్డు ఛేజింగ్

image

పాక్-న్యూజిలాండ్-సౌతాఫ్రికా వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ విజయం సాధించింది. 353 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వన్డేల్లో ఆ జట్టుకు ఇదే హైయెస్ట్ ఛేజింగ్. ఆ జట్టు బ్యాటర్లలో సల్మాన్ అఘా (134), కెప్టెన్ రిజ్వాన్ (122*) సెంచరీలతో రాణించారు. అంతకుముందు SA బ్యాటర్లలో బావుమా 82, మాథ్యూ బ్రీట్జ్కే 83, క్లాసెన్ 87 పరుగులు చేశారు.

News February 13, 2025

విజయసాయి రెడ్డి స్థానంలో కన్నబాబు

image

AP: వైసీపీలో పలు నియామకాలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆమోదం తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్‌గా కురసాల కన్నబాబును నియమించారు. గతంలో ఈ స్థానంలో విజయసాయి రెడ్డి ఉండేవారు. అలాగే కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దాడిశెట్టి రాజాను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.

error: Content is protected !!