News December 29, 2024
దేవుడి దగ్గర రాజకీయలు ఎందుకు?: శ్రీనివాస్ గౌడ్

TG: తిరుమల శ్రీవారి ఆలయంలో అందరినీ సమానంగా చూడాలని BRS నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ‘ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ అనే బేధాభిప్రాయాలు లేవు. సిఫారసు లేఖలు ఆపితే ఇకపై ఇలాంటి తేడాలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలోని ఆలయాల్లో అందరినీ సమానంగా చూస్తున్నాం. దేవుడి దగ్గర రాజకీయం ఎందుకు? చంద్రబాబు, TTD ఛైర్మన్ కూడా HYDలో ఉంటున్నారు. మేం ఏమైనా తేడాగా ప్రవర్తించామా?’ అని ఆయన ప్రశ్నించారు.
Similar News
News January 7, 2026
HYDకు 240 బస్సులేనా.. ఇదేం ప్లానింగ్?

AP: సంక్రాంతి సందర్భంగా 8,432 ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. అయితే పండుగకు ముందు హైదరాబాద్కు 240 బస్సులే కేటాయించడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి పండుగకు లక్షలాది మంది ఏపీకి వస్తారని, ప్రైవేటు ఆపరేటర్ల దోపిడీ ఉంటుందనే విషయం తెలిసీ ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే అదనపు బస్సులను పెంచాలని కోరుతున్నారు. మీరేమంటారు?
News January 7, 2026
మొక్కజొన్నతో పాటు మిరప సాగు.. చైనా రైతుల వినూత్న ఆలోచన

చైనాలో రైతులు మొక్కజొన్న తోటల్లోని పొత్తుల్లో గింజలు రావడం మొదలవ్వగానే ఆకులను తొలగించి వాటి కింద మిరప మొక్కలను నాటుతుంటారు. మొక్కజొన్న పంట పూర్తవ్వగానే కాడలను వేళ్లతో సహా పీకేయకుండా సగం వరకు కత్తిరిస్తారు. దీని వల్ల అవి మిరప మొక్కలకు సహజ ఊతకర్రలుగా ఉండి, గాలులకు అవి పడకుండా రక్షణగా ఉంటాయి. ఇలా వారు ఒకేసారి రెండు పంటలను పండించి మంచి ఆదాయం పొందుతారు. దీన్నే ఇంటర్ క్రాపింగ్, realy క్రాపింగ్ అంటారు.
News January 7, 2026
బ్లోఅవుట్ అదుపునకు మరికొన్ని రోజులు..

AP: కోనసీమ(D) ఇరుసుమండలో గ్యాస్ <<18779357>>బ్లోఅవుట్<<>> తీవ్రత తగ్గినప్పటికీ పూర్తిగా అదుపులోకి రాలేదు. ప్రస్తుతం 10-15M మేర మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నికీలలు వ్యాప్తి చెందకుండా, వేడి పెరగకుండా మోటార్ల ద్వారా నిత్యం నీటిని వెదజల్లుతున్నారు. ఢిల్లీ, ముంబై, డెహ్రాడూన్ నుంచి వచ్చిన నిపుణులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంటలు పూర్తిగా ఆగడానికి మరికొన్ని రోజులు పట్టొచ్చని చెబుతున్నారు.


