News May 3, 2024
అమేథీని కాదని రాయ్ బరేలీకి ఎందుకు?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమేథీలో పోటీ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. ఆయన అమేథీలో పోటీ చేస్తారని అంతా భావించారు. కాగా.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రాయ్ బరేలీ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. అయితే.. 2019లో అమేథీలో ఓడిన తర్వాత ఆ స్థానం కాంగ్రెస్కు చాలా దూరమైనట్లు పార్టీ భావిస్తోందని సమాచారం. మరోవైపు రాయ్ బరేలీ తన తల్లి స్థానం కావడంతో అక్కడ రాహుల్ గెలుపు నల్లేరుపై నడక అని పార్టీ విశ్వసిస్తోందట.
Similar News
News January 9, 2026
మడకశిరలో చెడ్డీ గ్యాంగ్ సంచారం.. పోలీసుల హెచ్చరిక

మడకశిర పట్టణ శివారు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ దొంగలు సంచరిస్తున్నట్లు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ లావణ్య ప్రజలను హెచ్చరించారు. రాత్రి సమయాల్లో ఎవరైనా తలుపులు తట్టినా, కాలింగ్ బెల్ కొట్టినా లేదా ప్రమాదం అని అరిచినా.. వెంటనే తలుపులు తీయొద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు.
News January 9, 2026
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు, బెల్టులు

TG: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు, బెల్టులు ప్రభుత్వం అందజేయనుంది. విద్యాశాఖ ప్రతిపాదనలను CM రేవంత్ రెడ్డి ఆమోదించారు. తద్వారా దాదాపు 20 లక్షలకు పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. అదే సమయంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆడబిడ్డలకు ప్రాధాన్యం ఇవ్వాలని CM సూచించారు. దీంతో మొదటి విడత పాఠశాలలు బాలికలకు కేటాయించనున్నారు.
News January 9, 2026
ఇకపై షోరూంలోనే వెహికల్ రిజిస్ట్రేషన్

TG: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ షోరూంలోనే పూర్తి చేసుకోవచ్చు. ఈ విధానం 15 రోజుల్లో అమలులోకి రానుంది. దీంతో ఇకపై కొత్త కారు, బైక్ కొన్నప్పుడు RTA ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. డీలర్ ఆన్లైన్లో అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి, రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. RC నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికే వచ్చేస్తోంది. ఈ సౌకర్యం నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.


