News March 25, 2024

హార్దిక్ పాండ్యపై ఇంత ద్వేషం ఎందుకు?

image

ప్రస్తుతం హార్దిక్ పాండ్యపై ఉన్న ద్వేషం ఏ క్రికెటర్‌పై ఉండి ఉండదు. రోహిత్ శర్మను కాదని ముంబై ఫ్రాంచైజీ పాండ్యకు కెప్టెన్సీ ఇవ్వడంతో వ్యతిరేకత పెరిగింది. పాండ్య సీనియర్లకు గౌరవం ఇవ్వరని, ఓవర్ కాన్ఫిడెన్స్ ప్లేయర్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. గాయాల బెడదతో అంతర్జాతీయ మ్యాచులకు దూరమైనా.. ఐపీఎల్ సమయానికి ఫిట్ అవుతారని చెబుతున్నారు. అయితే హార్దిక్ మ్యాచ్ విన్నర్ అని మరికొందరు గుర్తుచేస్తున్నారు.

Similar News

News September 13, 2024

యూపీలో మరో మహిళపై తోడేలు దాడి

image

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో మరోసారి ఓ మహిళ(28)పై తోడేలు దాడి చేసింది. ఈ దాడిలో బాధితురాలి మెడ, ఛాతీకి తీవ్రగాయాలయ్యాయి. ఆరు తోడేళ్లలో అధికారులు ఐదింటిని పట్టుకోగా, మరొకటి ఎంత ప్రయత్నించినా దొరకడం లేదు. అది గత 4 రోజులుగా దాడులు చేస్తోంది. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఆరో తోడేలును పట్టుకోవడం కష్టమవుతోందని అధికారులు వివరిస్తున్నారు.

News September 13, 2024

రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

image

TG: ఈ సారి పంట వేసిన రైతులకే రైతు భరోసా అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు ఈ నెలాఖరులోపు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరాకు రూ.7,500 చొప్పున రెండు విడతల్లో ఏడాదికి రూ.15,000 అందించాల్సి ఉంది.

News September 13, 2024

పోర్ట్‌బ్లెయిర్ ఇకపై ‘శ్రీ విజయపురం’: అమిత్ షా

image

పోర్ట్‌బ్లెయిర్ పేరును ‘శ్రీ విజయ పురం’గా మారుస్తున్నామని HM అమిత్‌షా అన్నారు. వలస వారసత్వం నుంచి విముక్తి కల్పించాలన్న ప్రధాని మోదీ ఆశయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్వీట్ చేశారు. ‘భారత స్వాతంత్ర్య చరిత్రలో A&N దీవులది ప్రత్యేక పాత్ర. ఒకప్పటి చోళుల నేవీ స్థావరం ఇప్పుడు భారత సైన్యానికి వ్యూహాత్మకం. నేతాజీ మొదట తిరంగా జెండాను ఎగరేసింది, వీర సావర్కర్‌ జైలుశిక్ష అనుభవించింది ఇక్కడే’ అని అన్నారు.