News May 25, 2024

క్రికెట్ పెద్దగా తెలియని USAలో T20WC ఎందుకు?

image

Jun 2న ప్రారంభమయ్యే T20 వరల్డ్ కప్‌కి వెస్టిండీస్‌తో పాటు అమెరికా ఆతిథ్యమివ్వనుంది. అయితే.. క్రికెట్ అంటే పెద్దగా తెలియని USAలో WC నిర్వహించడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. కాగా, కొత్త దేశాలకు క్రికెట్‌ విస్తరణ, కొత్త మార్కెట్ల అన్వేషణ, ఒలింపిక్స్‌లో క్రికెట్‌ చేరిక వంటి లక్ష్యాలతోనే ICC ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. USలో చాలామంది భారతీయులుండటం కూడా దీనికి సానుకూలాంశమని విశ్లేషకుల భావన.

Similar News

News February 14, 2025

ఘోరం: యువకుడిని చంపి ముక్కలుగా చేసి..

image

AP: రాష్ట్రంలో మరో దారుణ ఘటన జరిగింది. ప్రకాశం జిల్లా కంభంలో శ్యాంబాబు(30) అనే యువకుడిని దుండగులు ఘోరంగా హత్య చేశారు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి వాటిని బస్తాల్లో కుక్కి నక్కలగండి పంట కాలువలో పడేశారు. ఈ హత్య వెనుక సమీప బంధువులే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 14, 2025

Good News: హోల్‌సేల్ రేట్లు తగ్గాయ్..

image

భారత టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI) జనవరిలో 2.31 శాతానికి తగ్గింది. 2024 డిసెంబర్లో ఇది 2.37%. గత ఏడాది జనవరిలో ఇది 0.27 శాతమే కావడం గమనార్హం. ఆహార వస్తువుల ధరలు తగ్గడమే ఇందుకు కారణమని కామర్స్ మినిస్ట్రీ తెలిపింది. ఫుడ్ ప్రొడక్ట్స్, టెక్స్‌టైల్స్ తయారీ, క్రూడ్ పెట్రోల్, గ్యాస్ ధరలు మాత్రం పెరుగుతున్నట్టు పేర్కొంది. డిసెంబర్లో 8.89గా ఉన్న WPI ఫుడ్ ఇండెక్స్ విలువ జనవరిలో 7.47కు దిగొచ్చిందని తెలిపింది.

News February 14, 2025

అకౌంట్లోకి రూ.15,000.. రేపే లాస్ట్

image

కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి కేంద్ర ప్రభుత్వం ELI(ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం) అమలు చేస్తోంది. దీనికి అర్హత సాధించిన వారు ఫిబ్రవరి 15లోగా UAN యాక్టివేషన్, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో సీడింగ్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. అలా చేస్తే ఒక నెల జీతం(గరిష్ఠంగా ₹15000) 3 వాయిదాల్లో అందిస్తోంది. ఇది ఉద్యోగి ఖాతాలో జమ అవుతుంది. అయితే చాలామంది ఉద్యోగులు UAN యాక్టివేషన్, ఆధార్ సీడింగ్‌పై ఆసక్తి చూపడం లేదు.

error: Content is protected !!