News October 22, 2024

మంగళవారమే ఓటింగ్ ఎందుకు?

image

అమెరికాలో 170 సంవత్సరాలుగా నవంబర్‌లో మొదటి మంగళవారమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1800లలో USలో ఎక్కువగా రైతులే ఉండేవారు. పంట కోతల తర్వాత చలికాలానికి ముందు ఎన్నికలు జరిపేందుకు నవంబర్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఓటర్లు ఆదివారం ప్రయాణాన్ని ఇష్టపడనందున సోమవారం ప్రయాణించి, మంగళవారం ఓటేస్తారని ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ, ప్రస్తుత ఉద్యోగ పరిస్థితుల దృష్ట్యా వీకెండ్స్‌లో ఓటింగ్ నిర్వహించాలంటున్నారు.

Similar News

News November 11, 2025

భవిష్యత్తు బంగారం ‘రాగి’: అనలిస్టులు

image

ఈవీలు, సోలార్ ప్యానెల్స్, 5G టవర్లు, డేటా సెంటర్ల నిర్మాణంలో ఉపయోగించే రాగి విలువ పెరుగుతోందని అనలిస్టులు చెబుతున్నారు. ప్రధాన ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఇండోనేషియాలోని కాపర్ మైన్స్ వరదలు, ప్రమాదాలతో షట్‌డౌన్ అంచున ఉన్నాయి. 2026కు 6 లక్షల టన్నుల రాగి కొరత ఏర్పడవచ్చు. కొత్త మైన్స్ తెరిచేందుకు 10-15 ఏళ్లు పట్టొచ్చని అంటున్నారు. దీంతో భవిష్యత్తులో టన్ను రాగి 11-14 వేల డాలర్లకు చేరుకోవచ్చని చెబుతున్నారు.

News November 11, 2025

ఎవరీ ఉమర్ మహ్మద్?

image

ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని భావిస్తున్న ఉమర్ మహ్మద్ 1989లో J&K పుల్వామాలో జన్మించాడు. అతడి తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ టీచర్. శ్రీనగర్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉమర్ MBBS, MD చేశాడు. కొన్నాళ్లు GMC అనంతనాగ్‌లో సీనియర్ రెసిడెంట్‌గా, ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. SMలో ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులైన డాక్టర్లలో ఉమర్ ఒకడని తెలుస్తోంది.

News November 11, 2025

బ్యూటీ యాంగ్జైటీకి గురవుతున్నారా?

image

చాలామంది అమ్మాయిలు తరచూ అందాన్ని గురించి ఆలోచించడం, ఇతరులతో పోల్చుకోవడం చేస్తుంటారు. దీని వల్ల బ్యూటీ యాంగ్జైటీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే రోజూ సరిపడా ఆహారం తింటూనే క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేస్తూ ఆరోగ్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంచుకోవాలంటున్నారు. ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలు దూరం పెట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టాలని సూచిస్తున్నారు.